KGF Star meets Lokesh: నారా లోకేశ్ తో యశ్.. ఆసక్తి రేపుతున్న భేటీ!
కేజీఎఫ్ (KGF) స్టార్ యశ్ టీడీపీ నేత నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ హాట్ టాపిక్ గా మారింది.
- Author : Balu J
Date : 15-12-2022 - 5:34 IST
Published By : Hashtagu Telugu Desk
కేజీఎఫ్ (KGF) మూవీ హీరో యశ్ కు సంబంధించిన ఏ వార్త అయినా చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఈ కన్నడ సూపర్ స్టార్ యశ్ (Yash) టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. యష్ లోకేష్ (Lokesh)ను కలిసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఫొటో టీడీపీ పార్టీ సర్కిల్ లో షేర్ అవుతున్నాయి. ఫొటోలో యశ్, లోకేశ్ లు ముచ్చటించుకున్నట్టు చూడొచ్చు. మీడియా నివేదికల ప్రకారం యష్ లోకేష్‌ల ఈ సమావేశం దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగిందని సమాచారం.
అయితే వివరాలు మాత్రం బయటకు రాలేదు. యష్ చిరిగిన డెనిమ్, ఫుల్ స్లీవ్ క్యాజువల్ టీ-షర్ట్‌లో కనిపించగా, లోకేష్ తన సాధారణ రాజకీయ వస్త్రధారణలో కనిపించాడు. ఈ సంవత్సరం అతిపెద్ద బ్లాక్‌బస్టర్ తో ఆకట్టుకున్న యశ్ ను లోకేశ్ అభినందించి ఉండవచ్చునని తెలుస్తోంది. అయితే వీరిద్దరి భేటీ రాజకీయకంగానూ, సినిమాపరంగానూ తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
Also Read: Helicopter Puja: యాదగిరిగుట్టలో కొత్త హెలికాప్టర్ కు పూజ.. ధర ఎంతో తెలుసా!