Karate Kalyani Action: ఫ్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డిని రోడ్డుపైనే చితకబాదిన కరాటే కల్యాణి
సోషల్ మీడియా వేదికగా చేసే ఫ్రాంక్ వీడియోల ఉదంతం.. ఫ్రాంక్ స్టార్ గా చెప్పుకునే శ్రీకాంత్ రెడ్డికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
- By Hashtag U Published Date - 09:44 AM, Fri - 13 May 22
సోషల్ మీడియా వేదికగా చేసే ఫ్రాంక్ వీడియోల ఉదంతం.. ఫ్రాంక్ స్టార్ గా చెప్పుకునే శ్రీకాంత్ రెడ్డికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కరాటే కల్యాణి చేతిలో దెబ్బలు తినేలా చేసింది. ఫ్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యకర వీడియోలు చేస్తున్నారన్నది అతడిపై ఉన్న ఆరోపణ. అందుకే అదే కారణంతో కరాటే కల్యాణి శ్రీకాంత్ ను రోడ్డుపై నిలదీయడంతో గొడవ మొదలైంది. అది కాస్తా ముదిరి పాకాన పడింది.
శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న ఫ్రాంక్ వీడియోలపై కరాటే కల్యాణి అభ్యంతరం చెప్పింది. ఆయనపై ఆరోపణలు చేసింది. యూసఫ్ గూడలోని ఓ బస్తీలో శ్రీకాంత్ రెడ్డి వీడియోలు తీస్తుండగా కల్యాణితోపాటు మరో ఇద్దరు అక్కడికి వచ్చారు. ఫ్రాంక్ వీడియోలపై శ్రీకాంత్ ను నిలదీసింది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో శ్రీకాంత్ ను కల్యాణి చెంప దెబ్బ కొట్టడంతో వివాదం పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది. ఇంతలో శ్రీకాంత్ ను కొట్టడాన్ని గమనించిన మరో వ్యక్తి కూడా ఆయనపై చేయి చేసుకున్నాడు.
కల్యాణి చెంప దెబ్బతో ఖంగు తిన్న శ్రీకాంత్.. వెంటనే తేరుకుని ఆమె దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కల్యాణిని కొట్టి కింద పడేశాడు శ్రీకాంత్. ఈ వివాదాన్ని గమనించిన స్థానికులు శ్రీకాంత్ చేసిన పనికి ఆగ్రహంతో ఆయనపై దాడికి దిగారు. వాళ్లంతా సపోర్ట్ వచ్చేసరికీ కరాటే కల్యాణి మళ్లీ శ్రీకాంత్ పై దాడి చేసింది. ఆయనను వెంబడించి మరీ కొట్టడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో శ్రీకాంత్ బట్టలు చిరిగిపోయాయి. అతడు మళ్లీ కొంత దూరం వెళ్లి కల్యాణిపై దాడి చేస్తూ ఆరోపణలకు దిగాడు.
ఫ్రాంక్ వీడియోలు చేస్తే తప్పు అంటున్నావు.. నువ్వు చేసే పనికిమాలిన పనుల కంటే ఇది ఎక్కువేం కాదని కరాటే కల్యాణిని ఉద్దేశించి అన్నాడు శ్రీకాంత్ రెడ్డి. కల్యాణి భాగోతం మొత్తం తెలుసని, వీడియో తీసుకుంటానంటే.. రూ.2 లక్షలు డిమాండ్ చేసిందని.. ఇవ్వననేసరికీ ఇలా చేస్తోందని ఆరోపించాడు. ఈ వీడియో మొత్తం కరాటే కల్యాణి తన ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చింది. ఇప్పుడీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరూ ఒకరిపైమరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
Related News
Karate Kalyani : కరాటే కళ్యాణికి షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. ‘మా’ సభ్యత్వం రద్దు.. న్యాయపోరాటం చేస్తాను అంటూ..
కొన్ని రోజుల క్రితం కరాటే కళ్యాణి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోండి కానీ మా దేవుడు కృష్ణుడి రూపంలో పెట్టొద్దు. విగ్రహం మార్చకపోతే కోర్టు వరకు వెళ్తాను అంటూ హడావిడి చేసింది.