Dog Psychology: మీ డాగ్ రైట్ హ్యాండెడా ? లెఫ్ట్ హ్యాండెడా ? సైన్స్ ఏం చెబుతోందంటే..
మీరు కుక్కల ఎమోషనల్ వర్కింగ్ స్టైల్ (Working Style) ను తెలుసుకోవాలనుకుంటున్నారా
- By Balu J Published Date - 08:00 PM, Fri - 13 January 23

ప్రపంచంలో (World) చాలామంది కుడిచేతి వాటం కలిగి ఉంటారు. కేవలం 10 నుంచి 13 శాతం మంది ఎడమ చేతితో పని చేస్తారు. ఇక రెండు చేతులతో రాయడం, పనులు చేయడం వచ్చిన వాళ్ళను సవ్యసాచి అని పిలుస్తారు. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే కుక్కల (Dogs) గురించి కూడా ఇదే విషయాన్ని ఒక అధ్యయనం చెబుతోంది.
కుక్కల ఎమోషనల్ వర్కింగ్ స్టైల్ (Working Style) ను తెలుసుకునేందుకు నిర్వహించిన అధ్యయన నివేదిక ” పావ్ ప్రిఫరెన్స్” పేరుతో సైన్స్ డైరెక్ట్ జర్నల్ లో ప్రచురితమైంది. ఇందులో భాగంగా కుక్కల దినచర్యకు సంబంధించిన కార్యకలాపాలను దగ్గరగా పరిశీలించారు. ఆడుకోవడమో, తినడమో కాకుండా.. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కుక్కలు ఏ పంజా ముందుకు పెడతాయో కూడా కనిపించింది. ప్రతి కుక్కకు పాదాల ప్రాధాన్యత భిన్నంగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. చాలా కుక్కలు కుడిచేతి వాటమే కలిగి ఉన్నాయని గుర్తించారు. కొన్ని కుక్కలు రెండు పాదాలను బాగా ఉపయోగించగలవని కూడా కనుగొనబడింది.
షేక్ హ్యాండ్..
అలాంటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వమని అడిగినప్పుడు అన్ని కుక్కలు తమ కుడి కాలినే ఎందుకు పైకి లేపుతాయి? దీనికి కారణం మనం వారికి ఇస్తున్న శిక్షణ. కుక్కలతో కరచాలనం చేస్తున్నప్పుడు..మనం కుడి చేతిని, దాని కుడి చేతి వైపు చాస్తాము. అటువంటి పరిస్థితిలో, ఎడమ చేతి ప్రాధాన్యత కలిగిన కుక్క కూడా ఈ చర్యలో మనలాగే ప్రవర్తిస్తుంది.
ఆడ కుక్కలు.. (Female Dogs)
ఆడ కుక్కలు తమ కుడి పాదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాయని, మగ కుక్కలు ఎక్కువగా ఎడమచేతి వాటం కలిగి ఉంటాయని అధ్యయనం కనుగొంది.
మెదడు పనితీరు.. (Brain Working)
మనతో సహా కుక్కల శరీరంలోని కుడి భాగం మెదడులోని ఎడమ భాగంతో నియంత్రించబడుతుంది. శరీరం ఎడమ భాగం మెదడులోని కుడి భాగంతో నియంత్రించ బడుతుంది. కుక్క కుడి కాలు ప్రతికూలతను సూచిస్తుంది.ఎడమ కాలు సానుకూల భావోద్వేగాలను సూచిస్తుంది.కుక్క ఏ కాలుతో మెట్లపైకి ఎక్కడం లేదా దిగడం వంటివి చేస్తుందో చూసి..దాని ఎమోషనల్ సిచ్యువేషన్ ను అంచనా వేయొచ్చు.కుక్క కుడి పంజాకు ప్రాధాన్యత ఇస్తే.. భయపడటం లేదా త్వరగా కోపం తెచ్చుకోవడం వంటి ప్రతికూల భావోద్వేగాలను కలిగి ఉంటుంది. ఇంట్లో వేరే కుక్క లేదా పెంపుడు జంతువు ఉన్నా.. అది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎప్పుడూ టెన్షన్‌లో ఉంటుంది. తనకు సరిగ్గా ఫుడ్ పెట్టరేమో అనే కలవరంలో మునిగిపోతుంది.
తోక ఆడించడం.. (Tale Story)
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కుక్కలు తోకను మెలితిప్పడం ద్వారా కూడా తమ భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. కుక్కలు తమ పరిచయస్తులను లేదా కుటుంబ సభ్యులను చూడగానే ఎడమవైపుకు తోక ఆడిస్తాయి.దీన్నిబట్టి అవి సంతోషంగా ఉన్నాయని అర్థం. కుక్క తోకను కుడివైపుకి తిప్పడం అంటే దానికి భయమేస్తోందని అర్ధం. అమెరికన్ సైకలాజికల్ (Psychology) అసోసియేషన్ జర్నల్‌లో ఈమేరకు ఒక అధ్యయన నివేదిక పబ్లిష్ అయింది.