Earth 2.0 : ఎర్త్ 2.0 వెలుగులోకి.. అక్కడా జీవరాశులు.. మరో భూమి ‘టైటాన్’!!
భూమి లాంటి గ్రహం సౌర వ్యవస్థలో ఏదైనా ఉందా ? ఉంటే .. అది ఏది ? అంటే .. వచ్చే సమాధానం ' టైటాన్'. అందమైన శనిగ్రహం యొక్క 82 ఉపగ్రహాలలో టైటాన్ ఒకటి.
- By Hashtag U Published Date - 07:00 PM, Mon - 2 May 22
భూమి లాంటి గ్రహం సౌర వ్యవస్థలో ఏదైనా ఉందా ? ఉంటే .. అది ఏది ? అంటే .. వచ్చే సమాధానం ‘ టైటాన్’. అందమైన శనిగ్రహం యొక్క 82 ఉపగ్రహాలలో టైటాన్ ఒకటి. ఇంతకీ భూమిని తలపించేలా ఇందులో ఏముంది ? అనే దానికి సమాధానాన్ని అన్వేషిస్తూ అమెరికాలోని స్టాన్ ఫర్డ్ స్కూల్ ఆఫ్ ఎర్త్ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అక్కడా సముద్రాలు, నదులు, ఎడారులు..
మన భూమిలాగే.. టైటాన్ పైనా సముద్రాలు, నదులు, సరస్సులు, ఎడారులు ఉన్నాయి. అక్కడ కూడా వర్షం పడుతుంది. అయితే వాటిలో ఉండే మెటీరియల్ పూర్తిగా వేరు. టైటాన్ పై ఉష్ణోగ్రత సగటున మైనస్ 292 డిగ్రీలు ఉంటుంది. ఈ ఒక్క తేడా కారణంగా అక్కడి వాతావరణంలో పూర్తి వైవిధ్యం కనిపిస్తుంది. టైటాన్ పై ఉండే నదులు, సరస్సులు, సముద్రాల్లో నీళ్లు ఉండవు.. కానీ ద్రవరూపంలో ఉండే ఈథేన్, మీథేన్ వంటి హైడ్రో కార్బన్లు ఉంటాయి.
ఇసుక తిన్నెల ఆవిర్భావ క్రమం ఒక్కటే..
భూమిపైలాగే టైటాన్ పైనా ఇసుక తిన్నెలు ఉన్నాయి. భూమిపై గాలులు, నదీ ప్రవాహాల ద్వారా సిలికేట్ రాళ్ళ అవక్షేపాలు, పలు లవణాలు ఒక్కచోటుకు నెట్టబెడి ఘనీభవిస్తాయి. కాలక్రమంలో ఈ అవక్షేపాలు పరస్పరం ఢీకొని పరిమాణంలో చిన్నగా మారుతాయి. అవే ఇసుక రేణువులు. వీటన్నింటి సమాహారంగా ఇసుక తిన్నెలు ఏర్పడతాయి. టైటాన్ పైనా ఇదే తరహాలో ఇసుక తిన్నెలు ఏర్పడ్డాయని పరిశోధకులు అంటున్నారు. అయితే టైటాన్ యొక్క ఇసుక తిన్నెలు ఏర్పడటానికి ఘన రూప సేంద్రీయ సమ్మేళనాలు కీలక పాత్ర పోషించి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. బహమాస్ సహా పలు దేశాల్లో ‘ ooids’ అనే రకం అవక్షేప శిలలు లభిస్తాయి. ఇవి చూడటానికి తెల్ల రంగులో ఉంటాయి. ఇసుక రేణువులు, కాల్షియం కార్బోనేట్ వంటి లవణాలతో సమ్మేళనం చెంది ooids శిలలు ఏర్పడ్డాయి. బహుశా టైటాన్ పై ఉండే ఇసుక తిన్నెలు కూడా ఇదే విధంగా ఏర్పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
టైటాన్ సముద్రంలో ఏముందంటే..
1997లో నాసా పంపిన ‘కసిని’ స్పేస్ ప్రోబ్.. టైటాన్ పై ఒక మహా సముద్రాన్ని గుర్తించింది. దానికి ‘ క్రాకెన్ మారె’ అని పేరు పెట్టారు.
దీని మధ్యలో మైడా ఇన్సులా అనే ద్వీపం కూడా ఉంది.దీనిపై ప్రస్తుతం ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా ఈ పరిశోధనల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.ఈ సముద్రం కేంద్రం వద్ద 1000 అడుగుల లోతు ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతవరకు దీని లోతు 300 అడుగులేనని భావించారు. దీంతో సముద్రం లోపలికి రోబోటిక్ సబ్ మెరైన్ ను పంపి ప్రయోగాలు చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఉపగ్రహం ఉత్తర ధ్రువం వద్ద సముద్రం దాదాపు 1.54 లక్షల చదరపు మైళ్లు. ఇందులో ద్రవరూపం లో ఉండే ఈథేన్, మీథేన్ ఇతర హైడ్రోకార్బన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
టైటాన్ పై జీవరాశులు ?
తాజాగా శాస్త్రవేత్తలకు టైటాన్ వాతావరణంలో ఒక అరుదైన మాలిక్యూల్ కనిపించింది. దాని పేరు సైక్లోప్రోపెనిలిడెన్ (cyclopropenylidene (C3H2)). ఇది అత్యంత అరుదైన బొగ్గుతో తయారైన మాలిక్యూల్. ఇది ఎక్కువ సేపు ఉండదు. వెంటనే ఇతర మాలిక్యూల్స్ తో కలిసిపోయి వేరే పదార్థంగా మారిపోతుంది. ఇలాంటి దాన్ని భూమిపై… ప్రయోగశాలల్లో మాత్రమే స్థిరంగా ఉంచగలిగారు. ఈ మాలిక్యూల్.. మరిన్ని కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ని కూడా తయారు చేయగలదు. అవన్నీ కలిసి ఏదో ఒక రోజు… జీవం పుట్టేందుకు కారణం అవ్వగలవు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టైటాన్ పై ఇప్పటికే నీరు ఉంది కాబట్టి… అక్కడ జీవులు ఉండి ఉండొచ్చన్నది అనుమానం. ఈ విషయాన్ని తేల్చేందుకు 2027లో డ్రాగన్ ఫ్లై (Dragon fly) మిషన్ను నాసా ప్రారంభించబోతోంది. అది 4 ఏళ్లు ప్రయాణించి టైటాన్ ను చేరుతుంది.అది ఫొటోలు, వీడియోలూ తీస్తుంది. తిరిగి 2034లో భూమిని చేరుతుంది.
Related News
Shani: శనిదేవుని దుష్ప్రభావం మీపై ఉండకూడదంటే శనివారం రోజు ఈ ఆహారం తినాల్సిందే?
సాధారణంగా చాలామంది శనీశ్వరుని పేరు వెంటనే చాలా భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుని పూజించాలి అన్న ఆయన ఆలయానికి వెళ్లాలి అన్న కూడా భయ