16 New Years – 1 Day : అక్కడ ఒక్కరోజే 16సార్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఎందుకు ?
16 New Years - 1 Day : మనం ఇవాళ భూమిపై న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్‌గా చేసుకుంటున్నాం.
- Author : Pasha
Date : 01-01-2024 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
16 New Years – 1 Day : మనం ఇవాళ భూమిపై న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్‌గా చేసుకుంటున్నాం. కానీ ఆకాశంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఈ ఒక్కరోజే 16సార్లు న్యూ ఇయర్ వేడుకలను చేసుకునే వీలుంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే!! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. దాదాపు 90కిపైగా ప్రపంచ దేశాల ఎగువన అంతరిక్షంలోని నిర్దిష్ట కక్ష్యలో ఉంది. ఇది ప్రతీ 90 నిమిషాలకు ఒకసారి భూమి మొత్తాన్ని ప్రదక్షిణ చేస్తుంటుంది. ఇంత స్పీడులో తిరుగుతున్నందు వల్ల ప్రతిరోజూ 24 గంటల వ్యవధిలో ఐఎస్ఎస్‌లోని వ్యోమగాములు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను ఒకదాని తర్వాత ఒకటిగా చూస్తుంటారు. భూమిపై మనకు ప్రతిరోజు 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి ఉంటాయి. కానీ ఐఎస్ఎస్‌లో ప్రతి సూర్యోదయం 45 నిమిషాల పాటు, ప్రతి సూర్యాస్తమయం 45 నిమిషాలు పాటు కొనసాగుతాయి. ఈ లెక్కన అక్కడున్న ఏడుగురు వ్యోమగాములు ఇవాళ 16 సార్లు న్యూ ఇయర్ వేడుకలను(16 New Years – 1 Day) చేసుకునే వీలు ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 15 దేశాలకు చెందిన ఐదు అంతరిక్ష సంస్థలు నిర్వహిస్తున్నాయి.
- ఐఎస్ఎస్ సైజులో.. ఆరు బెడ్ రూమ్స్ కలిగిన ఇంటి కంటే పెద్దగా ఉంటుంది.
- ఐఎస్ఎస్‌లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది ఉన్నారు.
- ఐఎస్ఎస్‌లో ఎక్కువ కాలం పాటు గడిపిన వ్యోమగామి పేరు పెగ్గీ విట్సన్. ఇతడు అమెరికా దేశస్తుడు.
- 2017లో పెగ్గీ విట్సన్ ఐఎస్ఎస్‌లో అత్యధికంగా 665 రోజులు గడిపాడు.
- ఐఎస్ఎస్‌లో పగలు, రాత్రి వేగంగా.. కొంత గ్యాప్‌లోనే సంభవిస్తుంటాయి. ఈ పరిస్థితిని వాడుకొని వ్యోమగాములు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.