Today Miracle In Space : ఇవాళ రాత్రి శనిగ్రహాన్ని చూసే ఛాన్స్.. ఎలా చూడాలో తెలుసా ?
Today Miracle In Space : శనిగ్రహాన్ని చూడాలని ఉందా ? చుట్టూ అందమైన వలయాలతో అట్రాక్టివ్ గా ఉండే రెండో అతిపెద్ద గ్రహం ‘శని’ అందాలను చూసే అవకాశం దక్కితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది !!
- By Pasha Published Date - 10:04 AM, Sun - 27 August 23

Today Miracle In Space : శనిగ్రహాన్ని చూడాలని ఉందా ? చుట్టూ అందమైన వలయాలతో అట్రాక్టివ్ గా ఉండే రెండో అతిపెద్ద గ్రహం ‘శని’ అందాలను చూసే అవకాశం దక్కితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది !! అయితే ఇదే మీకు గొప్ప ఛాన్స్.. ఇవాళ రాత్రి మీరు ఆకాశ వీధిలో శనిగ్రహాన్ని చూడొచ్చు. ఎలా చూడాలంటే.. సూర్యుడు అస్తమించే దిక్కు పడమర. పడమర దిక్కుకు పూర్తిగా అపోజిట్ డైరెక్షన్ లో (తూర్పు దిక్కులో) శనిగ్రహం తళతళా మెరుస్తూ కనిపిస్తుంది. సూర్యాస్తమయం తర్వాతి నుంచే మీరు శనిగ్రహాన్ని చూడొచ్చు.
Also read : Govt Schools – Facial Recognition : ఇక గవర్నమెంట్ స్కూళ్లలో ముఖంతో అటెండెన్స్
శనిగ్రహాన్ని రింగ్స్ తో సహా చూడాలని భావిస్తే టెలిస్కోప్ (Today Miracle In Space) అవసరం. టెలిస్కోప్ లో మీకు శనిగ్రహం వలయాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. నేరుగా కళ్లతో చూస్తే మెరుస్తున్న చిన్న గోలీలాగా కనిపిస్తుంది. ఒకవేళ బైనాక్యులర్‌తో చూస్తే.. మెరుస్తున్న పెద్ద గోలీలాగా శనిగ్రహం కనిపిస్తుంది. వలయాలు మాత్రం కనిపించవు. ఇవాళ రాత్రికి సూర్యుడు, శనిగ్రహం, భూమి ఒకే లైన్ లోకి వస్తాయి. సూర్యుడు, శని మధ్యలో మన భూమి ఉంటుంది. సూర్య కిరణాల కారణంగా శనిగ్రహంలో పూర్తిస్థాయిలో మెరుపు ఉంటుంది. శుక్రగ్రహం, బుధగ్రహం ఎల్లప్పుడూ భూమి, సూర్యుడి మధ్యే ఉంటాయి. కానీ గురు, శని, యురేనస్, నెప్ట్యూన్ సంవత్సరంలో ఒకసారి సూర్యూడికి వ్యతిరేక దిక్కులోకి వెళ్తాయి. అంగారక గ్రహం ప్రతీ 27 నెలలకు ఒకసారి అపోజిషన్‌లోకి వెళ్తుంది.