HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >How To Keep Batteries Of Electric Vehicles Safe I Details Here

EV Batteries: ఎలక్ట్రిక్ బ్యాటరీలను సేఫ్ గా ఉంచేందుకు చిట్కాలు ఇవిగో..

ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీ అంచనాలతో మార్కెట్లోకి వచ్చాయి.

  • Author : Hashtag U Date : 04-10-2022 - 7:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ev Imresizer
Ev Imresizer

ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీ అంచనాలతో మార్కెట్లోకి వచ్చాయి. అయితే కొన్ని కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు దేశంలో పలుచోట్ల పేలడం కలకలం సృష్టించింది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు అనగానే కొందరు అనవసరంగా భయకంపితులు అవుతున్నారు. ఆ బ్యాటరీలు పేలకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలని, భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం సైతం చర్యలకు ఉపక్రమించింది. అటు ఈవీల తయారీ కంపెనీలు కూడా దేశంలో ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా నాణ్యమైన బ్యాటరీలను రూపొందించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

బ్యాటరీల దీర్ఘాయువును పెంచే చిట్కాలు..

* ఎలక్ట్రిక్ వాహనాన్ని నీడలో పార్క్ చేయండి. ప్లగ్ ఇన్‌లో ఉంచండి. తద్వారా మీ వాహనంలో థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గ్రిడ్ పవర్‌తో మాత్రమే పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతల పరిధిని నియంత్రణలో ఉంచండి.

* మీ ఎలక్ట్రిక్ వాహనంలోని బ్యాటరీలు అత్యంత చల్లని, వేడి వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వాటికి రక్షణ కవచాలు తొడగండి.

* నాణ్యమైన బ్యాటరీ రకాలనే ఎంచుకోండి. బ్యాటరీ ఛార్జింగ్ చేసేందుకు ప్రామాణికమైన ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఛార్జర్‌లను పదేపదే మార్చవద్దు.

* బ్యాటరీ పూర్తిగా అయిపోయే వరకు ఉపయోగించవద్దు. నిండుగా ఛార్జింగ్ చేయవద్దు. ఎల్లప్పుడు 20 శాతానికి తక్కువ కాకుండా, 80 శాతానికి మించకుండా ఛార్జింగ్ పెట్టుకోవాలి.

* మీ ఎలక్ట్రిక్ వాహనంతో రైడ్ చేసి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టవద్దు. ఒక గంటసేపు పక్కన ఉంచి చల్లబరచడం మంచిది. ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

* మీరు ఎలక్ట్రిక్ వాహనం నడిపేటపుడు వేడెక్కుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాహనం నీడలో పార్క్ చేయండి. కొద్దిసేపు ఉపయోగించడం ఆపేయండి.

* మీ బ్యాటరీకి సంబంధించి ఎలాంటి సమస్యను గుర్తించినా వెంటనే ఛార్జింగ్ నుంచి తొలగించి, మీ డీలర్‌ను సంప్రదించండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Batteries
  • battery management in EV
  • Electric Vehicles
  • electric vehicles safety

Related News

Ather scooter prices to increase from January

జనవరి నుంచి ఏథర్ స్కూటర్లకు ధరల పెంపు

జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3,000 వరకు ధర పెరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ ధరల పెంపు ప్రతి మోడల్‌కు ఒకేలా కాకుండా వేర్వేరుగా ఉండనుంది.

    Latest News

    • ‘కెనరా ఏఐ 1పే’ యూపీఐ యాప్‌ను విడుదల చేసిన కెనరా బ్యాంక్

    • చైనా దృష్టి అంత అరుణాచల్‌ప్రదేశ్‌ పైనేనా? ఎందుకని ?

    • చలికాలంలో ఎముకల దృఢంగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?!

    • గిర్నార్ దేవతల కొండల సీక్రెట్ స్టోరీ

    • క్రిస్మస్‌కు స్టార్ ఎందుకు పెడతారంటే?.. ఇది అలంకారం కోసం కాదా?!

    Trending News

      • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

      • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

      • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

      • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

      • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd