Viral Video : ఫాంటాతో మ్యాగీ.. ఇదేం కాంబినేషన్‌రా బాబోయ్..!
ఓరియో పకోడీలు, ఫాంటా ఆమ్లెట్లు.. సంబంధం లేని ఇంగ్రీడియంట్స్‌తో ఫుడ్ తయారుచేయడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. ఇలాంటి ఓ ప్రయోగమే చేశాడు ఘజియాబాద్‌లోని రోడ్ సైడ్ టిఫిన్ అమ్మే వ్యక్తి. అదే ఫాంటా మ్యాగీ.
- By Hashtag U Published Date - 11:39 AM, Mon - 22 November 21
జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదని కొన్ని చూస్తే అనిపిస్తుంది. ఓరియో పకోడీలు, ఫాంటా ఆమ్లెట్లు.. సంబంధం లేని ఇంగ్రీడియంట్స్‌తో ఫుడ్ తయారుచేయడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. ఇలాంటి ఓ ప్రయోగమే చేశాడు ఘజియాబాద్‌లోని రోడ్ సైడ్ టిఫిన్ అమ్మే వ్యక్తి. అదే ఫాంటా మ్యాగీ.
అవును.. ఫాంటాతో మ్యాగీ తయారుచేశాడు. యూట్యూబ్‌లో ఫుడ్ వీడియోలు చేసే అమర్ అనే వ్యక్తి ఈ విషయం తెలిసి అక్కడకు వెళ్లి ఎలా తయారుచేస్తున్నాడో షూట్ చేసి తన ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడండి..
కేవలం 30 రూపాయలకే ఈ ఫ్యాంటా మ్యాగీ అందిస్తున్నాడు. దాదాపు ఆర్నెల్ల నుంచి ఈ ప్రయోగం చేస్తున్నానని, వచ్చినవాళ్లలో చాలామందికి టేస్ట్ నచ్చుతోందని కూడా చెబుతున్నాడు దాని చెఫ్.
ఈ వీడియో చూసిన వాళ్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఒకరు ఇదేం టేస్ట్‌రా బాబోయ్ అంటే మరికొంతమంది ఇలాంటివి ట్రై చేస్తేనే మజా అని కామెంట్ పెడుతున్నారు.
Tags
Related News
Gold-Silver Panipuri : బంగారం-సిల్వర్‌తో పానీపూరీ.. టేస్ట్ అయితే.. యమ్మీ..!
భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ విషయానికి వస్తే, పానీ పూరీ ఖచ్చితంగా చాలా మందికి అగ్రస్థానంలో ఉంటుంది. సన్నని, స్ఫుటమైన వృత్తాకార క్రస్ట్, ఒక పెద్ద చిటికెడు గుజ్జు బంగాళాదుంపల కోసం ఖాళీ చేసి రంధ్రంలో మసాలా, చిక్కగా ఉండే చింతపండు నీటితో నింపి తింటే.. ఆహా ఆ రుచే వేరు.