Mosquito Vs Your Soap : మీ దగ్గరికి దోమలను లాగుతున్నది ఆ సబ్బులే !
Mosquito Vs Your Soap : కొందరిని దోమలు బాగా కుడుతుంటాయి .. ఇంకొందరిని దోమలు అంతగా కుట్టవు..ఎందుకీ తేడా.. అసలు విషయమంతా సబ్బులోనే ఉందని తేలింది.
- By Pasha Published Date - 11:00 AM, Tue - 13 June 23

Mosquito Vs Your Soap : కొందరిని దోమలు బాగా కుడుతుంటాయి ..
ఇంకొందరిని దోమలు అంతగా కుట్టవు..
ఎందుకీ తేడా.. అసలు విషయమంతా సబ్బులోనే ఉందని తేలింది.
దోమలు ఎలా జీవిస్తాయి ? కేవలం మనుషుల రక్తమే వాటి ఆహారమా ? అంటే.. “కాదు” అనేదే ఆన్సర్ !! దోమలు మొక్కల కాండం, ఆకులు, పువ్వులపై వాలిపోయి.. వాటిలోకి తమ సన్నటి తొండాన్నిచొప్పించి అందులో నుంచి రసాన్ని పీలుస్తాయి. ఆ రసంలో తియ్యటి షుగర్ కంటెంట్ ఉంటుంది. దానితో తమ మనుగడ కొనసాగిస్తాయి. మనుషుల నుంచి రక్తం పీల్చడం అనేది దోమల ఎక్స్ ట్రా యాక్టివిటీ మాత్రమే!! మగ దోమలు కేవలం మొక్కల నుంచి షుగర్ కంటెంట్ ను పీల్చుకొని జీవిస్తాయి. అందుకే అవి వారం రోజుల కంటే ఎక్కువ బతుకవు. ఆడ దోమలు మొక్కల నుంచి షుగర్ కంటెంట్ ను పీల్చుకుంటూనే .. మనుషుల నుంచి రక్తం కూడా పీలుస్తుంటాయి. అందుకే అవి 5 నెలల దాకా బతుకుతాయి.
స్టడీ రిపోర్ట్ లో ఏముంది ?
మీ చుట్టూ దోమలు మూగడానికి అతిపెద్ద కారణం.. మీరు వాడుతున్న సబ్బే(Mosquito Vs Your Soap) అని అమెరికాలోని వర్జీనియా టెక్ విద్యా సంస్థకు చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ పరిశోధకులు అంటున్నారు. దోమలకు .. సబ్బు నుంచి వచ్చే సువాసనలకు ఉన్న సంబంధంపై వారు జరిపిన రీసెర్చ్ లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. పండ్లు, పువ్వుల వాసనలు వెదజల్లే సబ్బులను వాడే వాళ్ళ చుట్టూ దోమలు ఎక్కువగా మూగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈమేరకు వివరాలతో iScience జర్నల్‌లో ఒక స్టడీ రిపోర్ట్ పబ్లిష్ అయింది.
Also read : Monsoon Malaria: టీ పొడిని గిన్నెలో వేసి కాల్చితే ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయా?
కొబ్బరి వాసన కలిగిన సబ్బుతో దోమలకు చెక్
ఈ అధ్యయనంలో ప్రధాన పరిశోధకుడిగా వ్యవహరించిన క్లెమెంట్ వినాగర్ కీలక విషయాలు తెలిపారు. “మీరు సబ్బును కొనేటప్పుడు దాని వాసన చూడండి. ఫ్రూట్స్ వాసన, పువ్వుల వాసన కలిగిన సబ్బులు వాడితే దోమలు కుట్టే అవకాశాలు పెరుగుతాయి. కొబ్బరి వాసన కలిగిన సబ్బులు వాడితే దోమలు కుట్టడం బాగా తగ్గిందని మేం రీసెర్చ్ లో గుర్తించాం” అని ఆయన వెల్లడించారు.