Praneeth Hanumanthu : ప్రణీత్ హన్మంతు ఎక్కడ కనిపిస్తే..అక్కడ చెప్పుతో కొట్టాలి
ఎదుటి వాళ్లను తక్కువ చేసి మాట్లాడడం, వారి బాడీ షేపులపై కామెంట్స్ చేయడం వంటివి చేస్తూ పాపులర్ అయ్యాడు
- By Sudheer Published Date - 08:30 PM, Mon - 8 July 24

యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు (Praneeth Hanumanthu) పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా ను అందరు వాడుతున్నారు. రాత్రికి రాత్రే సోషల్ మీడియా లో పాపులర్ కావాలని కొంతమంది , వ్యూస్ కోసం కొంతమంది నీచమైన పనులు , సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. ఆలా చేస్తున్న వారిలో ప్రణీత్ హన్మంతు ఒకడు.కొద్దీ రోజుల్లోనే ఇతడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. ఏదో మంచి చేసి కాదు.. తనలాంటి మెంటాలిటీ ఉన్న కొంతమంది పోగేసుకుని వాళ్లతో మాట్లాడుతూ.. ఎదుటి వాళ్లను తక్కువ చేసి మాట్లాడడం, వారి బాడీ షేపులపై కామెంట్స్ చేయడం వంటివి చేస్తూ పాపులర్ అయ్యాడు.
తాజాగా ఇతడు తండ్రికూతుళ్ల రిలేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ.. చైల్డ్ అబ్యూస్‌కి పాల్పడ్డాడు. అయితే ఆ వీడియో నెట్‌లో వైరల్ కావడంతో.. సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు , నెటిజన్లు ఇతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కనిపిస్తే చెప్పుతో కొడతాం అంటూ హెచ్చరిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, మంచు మనోజ్, రేణూ దేశాయ్, అడవిశేష్, కార్తికేయ, విశ్వక్ సేన్, నారా రోహిత్, సుధీర్ బాబు, చిన్మయి ఇలా చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ.. ఆ సోషల్ మీడియాఇతడి ఫై చర్యలు తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.
‘సమాజంలో మృగాలుగా తిరుగుతున్న నీచులు, నికృష్టులు అన్నాచెల్లెళ్లు, తండ్రీకూతుళ్ల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం బాధాకరం. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేశాం. భవిష్యత్తులో కూడా దుర్మార్గులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు చేపడుతున్నాం. నిందితులను కఠినంగా శిక్షిస్తాం’ అని ఆమె స్పష్టం చేశారు.
Read Also : Jogi Ramesh : నన్ను ఎలాగైనా జైల్లో వెయ్యాలని లోకేష్ చూస్తున్నాడు – జోగి