Diamonds Water : వాటర్ బాటిల్ రూ.లక్ష.. వజ్రాలతో బాటిల్ క్యాప్
Diamonds Water : ఒక వాటర్ బాటిల్ ను కొనేందుకు మీ నెల జీతం మొత్తం కూడా సరిపోదు.. కనీసం లక్ష రూపాయలు జేబులో లేనిదే కొనలేని ఆ వాటర్ బాటిల్ కథేంటో చూద్దాం..
- By Pasha Published Date - 02:02 PM, Tue - 20 June 23
Diamonds Water : వాటర్ బాటిల్ ధర ఎంత ?
20 రూపాయల నుంచి రూ. 100 దాకా వివిధ రేంజ్ లలో వివిధ క్వాలిటీల వాటర్ బాటిల్స్ దొరుకుతుంటాయి..
విమానంలో అయినా.. రైలులో అయినా.. బస్సులో అయినా వాటర్ బాటిల్ రేటు ఇంతకంటే ఎక్కువ ఉండదు.
కానీ ఒక వాటర్ బాటిల్ ను కొనేందుకు మీ నెల జీతం మొత్తం కూడా సరిపోదు..
కనీసం లక్ష రూపాయలు జేబులో లేనిదే కొనలేని ఆ వాటర్ బాటిల్ కథేంటో చూద్దాం..
లగ్జరీ ఇళ్ళు.. లగ్జరీ కార్లు.. లగ్జరీ ఆభరణాల గురించి మీరు విని ఉంటారు. కానీ బాగా ధనిక దేశాలలో లగ్జరీ వాటర్ ను కూడా అమ్ముతుంటారు. జపాన్‌కు చెందిన మినరల్ వాటర్ కంపెనీ “ఫెలికో జ్యువెలరీ వాటర్” అనేది లగ్జరీ వాటర్ తయారీలో చాలా ఫేమస్. ఇది రీసెంట్ గా తయారుచేసిన 750 ఎం.ఎల్ వాటర్ బాటిల్ ధర రూ. 1.15 లక్షలు. ఇంతకీ ఎందుకు అంత ధర ? ఈ వాటర్ బాటిల్ లో నింపే నీటిని జపాన్ లోని ఒసాకా సిటీ సమీపంలో ఉన్న రోకో పర్వత నీటి ఊట నుంచి సేకరిస్తారు. పర్వతం దిగువ భాగంలో లభించే ఈ నీటిలో ఆక్సిజన్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందని అంటారు. ఇక్కడి నుంచి వాటర్ ప్లాంట్ కు నీటిని తీసుకొచ్చిన తర్వాత గ్రానైట్ ఫిల్ట్రేషన్, స్వేదనం, కార్బొనేషన్, శుద్దీకరణ వంటి ప్రక్రియల ద్వారా ఫిల్టర్ చేస్తారు. నీటి నుంచి అన్ని రకాల మలినాలను సహజ పద్ధతిలో తొలగిస్తారు. ఈ వాటర్ తో కూడిన బాటిల్ కూడా చాలా ప్రత్యేకమైనది. ఫిలికో బాటిల్ డిజైనింగ్ కూడా వెరీ ఫేమస్. ఈ కంపెనీ వాటర్ బాటిళ్లను వివిధ రకాల వజ్రాలు, ఆభరణాలతో అలంకరిస్తుంది. సీసా మూత కూడా వజ్రాలతో, బంగారు పొరతో (Diamonds Water) ఉంటుంది. “ఫెలికో జ్యువెలరీ వాటర్” కంపెనీ నెలకు 5000 బాటిల్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.
Also read : American Woman: లగ్జరీ లైఫ్ కు వదులుకొని, సన్యాసం తీసుకున్న అమెరికన్ మహిళ
బెవర్లీ హిల్స్ 9OH2O (Beverly Hills 9OH2O)
ఈ కంపెనీ ఉత్పత్తి చేసే వాటర్ బాటిల్స్ లో కాలిఫోర్నియాలోని నీటి ఊట నుంచి సేకరించే నీటిని నింపుతారు. బెవర్లీ హిల్స్ వాటర్ బాటిల్ పై దాదాపు 850 సూక్ష్మ వజ్రాలను కలిగి ఉన్న క్యాప్ ను బిగిస్తారు. అందుకే 1 లీటరు బెవర్లీ హిల్స్ వాటర్ బాటిల్ ధర 1 కోటి 64 లక్షల రూపాయలు. 500 ml బాటిల్ ధర రూ.82 లక్షలు. 2017 నుంచి ఈ కంపెనీ వాటర్ బాటిల్స్ ప్రొడక్షన్ ను చాలా తగ్గించింది.
ఆక్వా డి క్రిస్టల్లో( Acqua di Cristallo)
ఫిజీ, ఫ్రాన్స్, ఐస్లాండిక్ హిమానీ నదంలోని నీటి ఊటల నుంచి సేకరించిన నీటితో ఈ వాటర్ బాటిల్స్ ను నింపుతారు. ఈ లీటరు నీటి ధర దాదాపు 50 లక్షల రూపాయలు. ఈ ప్రతి బాటిల్ లో పూత పూసిన 24k బంగారం ఉంటుంది. అయితే ఈ వాటర్ బాటిల్స్ ను ఎప్పటికీ సేల్ చేయరు. 2010లో ఒక వేలంలో ఈ బాటిల్స్ ను సేల్ చేశారు. కాబట్టి ఇది వాటర్ సేల్ చేసే రెగ్యులర్ మినరల్ వాటర్ బ్రాండ్ కాదు.
Also read : Singh Is King: సూపర్ సర్దార్.. 15 టర్బన్స్.. 15 కలర్లు..15 లగ్జరీ కార్లు
నెవాస్ (Nevas)
నెవాస్ కంపెనీ లీటరు వాటర్ బాటిల్ ధర సుమారు రూ.82వేలు. వందల ఏళ్ల కిందటి రెండు జర్మన్ ఆర్టీసియన్ బావుల నుంచి సేకరించే నీటిని ఈ బాటిల్స్ లో నింపి అమ్ముతారు. విలాసవంతమైన షాంపైన్ బాటిళ్లలో ఈ నీళ్లు ప్యాక్ చేస్తారు. ఈ వాటర్ బాటిల్స్ చూడటానికి షాంపైన్ లా కనిపిస్తాయి.
Tags
Related News
Ram Temple: 5 వేల వజ్రాలతో రామ మందిరం నెక్లెస్.. సూరత్ వ్యాపారి బహుమతి
ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి రామమందిరం కోసం వజ్రాల హారాన్ని తయారు చేసి తన భక్తిని చాటుకున్నారు.