Fake Currency Notes : ఏకంగా ఆర్బీఐకి చేరిన నకిలీ నోట్లు.. ఎలా ?
Fake Currency Notes : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భోగని పుర్ లో ఉన్న పుఖారాయం ఎస్బీఐ బ్రాంచ్ నుంచి కొంత నగదు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లింది.
- Author : Pasha
Date : 10-10-2023 - 4:20 IST
Published By : Hashtagu Telugu Desk
Fake Currency Notes : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భోగని పుర్ లో ఉన్న పుఖారాయం ఎస్బీఐ బ్రాంచ్ నుంచి కొంత నగదు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు వెళ్లింది. దాన్ని చెక్ చేసిన ఆర్బీఐ అధికారులు.. వాటిలో కొన్ని నకిలీ నోట్లు ఉన్నాయని తేల్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలని పుఖారాయం ఎస్బీఐ బ్రాంచ్ ను ఆదేశించారు. దీనిపై ఆర్బీఐ అధికారి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంబంధిత బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతకు ముందు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో కూడా కేసు నమోదు చేశారు. ఆర్బీఐ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు భోగనిపుర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ప్రమోద్ కుమార్ శుక్లా తెలిపారు. త్వరలోనే నకిలీ నోట్ల నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
కరెన్సీ నోట్లలో నకిలీది ఏది ? అసలుది ఏది ? అనేది గుర్తించే విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ తెలుసుకుందాం. అన్ని నోట్లలో వాటర్ మార్క్ ఉంటుంది. కాంతిలో పెడితే.. ఆ వాటర్ మార్క్ లో మహాత్మా గాంధీ ఫొటో కనిపిస్తుంది. కరెన్సీ నోట్లలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. దానిపై ఆర్బీఐ, నోట్ డినామినేషన్ వివరాలు ఉంటాయి. కాంతి పడినప్పుడు ఈ థ్రెడ్ రంగు మారుతుంది. కరెన్సీ నోటు స్పష్టమైన గీతలతో ఉంటుంది. నోట్లలో సూక్ష్మ అక్షరాలు, భూతద్దంలో చూడగలిగేలా ఉంటాయి. నకిలీ నోట్లు మృదువుగా, జారేలా ఉంటాయి. నోటుపై ప్రత్యేక క్రమ సంఖ్య ముద్రించి ఉంటుంది. ఇది నోటుకు రెండు వైపులా ఒకేలా ఉంటుంది. సైడ్ ప్యానెల్ లో ముద్రించిన క్రమ సంఖ్యతో (Fake Currency Notes) అది సరిపోలుతుంది.