900 Crores To Girl Friend : గర్ల్ ఫ్రెండ్ కు 900 కోట్ల ఆస్తిని రాసిచ్చిన లీడర్
900 Crores To Girl Friend : రూ. 9,05,86,54,868.. ఈ నంబర్స్ లెక్క పెట్టారా ? ఎంత ఉన్నాయ్ ?
- Author : Pasha
Date : 10-07-2023 - 10:37 IST
Published By : Hashtagu Telugu Desk
900 Crores To Girl Friend : రూ. 9,05,86,54,868..
ఈ నంబర్స్ లెక్క పెట్టారా ?
ఎంత ఉన్నాయ్ ?
900 కోట్ల రూపాయలు కదా !!
ఇంత భారీ ఆస్తిని ఇటలీ మాజీ ప్రధాని 86 ఏళ్ళ సిల్వియో బెర్లుస్కోనీ తన గర్ల్ ఫ్రెండ్ 33 ఏళ్ళ మార్టా ఫాసినాకు రాసిచ్చారు. బెర్లుస్కోనీ గత నెలలోనే చనిపోయారు. మూడుసార్లు ఇటలీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు మొత్తం రూ.56వేల కోట్ల ఆస్తి ఉంది. అందులో రూ.900 కోట్లను గర్ల్ ఫ్రెండ్ మార్టా ఫాసినాకు ఇవ్వడం గమనార్హం. ఈమేరకు ఆయన వీలునామా రాశారు. ఐదుగురు పిల్లలు, ఇతర సాక్షుల సమక్షంలో ఈ వీలునామాను(900 Crores To Girl Friend) గత మంగళవారం చదివి వినిపించారు. వీలునామాలో బెర్లుస్కోనీ ఇలా రాశాడు.. ”నా పేరిట ఉన్న కంపెనీ స్టాక్స్ ను నా పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు సమాన భాగాలుగా ఇస్తున్నాను. మిగిలిన ఆస్తులను ఐదుగురు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికి సమాన భాగాలుగా ఇస్తున్నాను” అని అందులో పేర్కొన్నారు.
Also read : Telangana BJP: ఈటల రాజకీయం షురూ.. అసమ్మతి నేతలతో మంతనాలు
మార్టా ఫాసినాతో బెర్లుస్కోనీకి రిలేషన్ షిప్ 2020 మార్చిలో ప్రారంభమైంది. అయితే ఆమెను పెళ్లి మాత్రం చేసుకోలేదు. బెర్లుస్కోనీ చనిపోయేటప్పుడు మార్టా ఫాసినాను తన భార్య అని చెప్పారని అంటున్నారు. బెర్లుస్కోనీ ఇద్దరు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో కలిసి మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతుంటారు. వీరికి బెర్లుస్కోనీ కంపెనీలో 53 శాతం వాటా ఉంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మరో రూ.900 కోట్ల ఆస్తిని తన సోదరుడు పాలోకు.. తన ఫోర్జా ఇటాలియా పార్టీకి చెందిన మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి రూ.270 కోట్ల ఆస్తిని బెర్లుస్కోనీ రాసిచ్చాడు. కాగా, బెర్లుస్కోనీకి కరోనా సోకడంతో 2020 సెప్టెంబర్ లో 11 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. 2023 ఏప్రిల్ నుంచి లుకేమియా సంబంధిత వ్యాధితో బాధపడుతూ జూన్ 12న 86 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయారు.