Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Countries Queue Up To Get A Piece Of Asteroid That Hides Ingredients For Life

Everyone wants a grain: అంతరిక్షం నుంచే భూమిపైకి జీవం ? ‘ర్యుగు’ ఆస్టరాయిడ్ లోని అమైనో యాసిడ్లలో గుట్టు!

చాలా దేశాలు జపాన్ కు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. తమకు ఆ శాంపిల్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి ? ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 40 దేశాలు అప్లికేషన్స్ ఇచ్చాయి. ఇంతకీ ఆ శాంపిల్ ఏమిటి ? దానికి ఎందుకు అంత డిమాండ్ ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • By Hashtag U Published Date - 07:00 AM, Tue - 21 June 22
Everyone wants a grain:  అంతరిక్షం నుంచే భూమిపైకి జీవం ? ‘ర్యుగు’ ఆస్టరాయిడ్ లోని అమైనో యాసిడ్లలో గుట్టు!

చాలా దేశాలు జపాన్ కు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. తమకు ఆ శాంపిల్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి ? ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 40 దేశాలు అప్లికేషన్స్ ఇచ్చాయి. ఇంతకీ ఆ శాంపిల్ ఏమిటి ? దానికి ఎందుకు అంత డిమాండ్ ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

“హాయబుస 2” భూమికి పంపింది..

“హాయబుస 2” అనే జపనీస్ వ్యోమ నౌక అంతరిక్షంలోని గ్రహ శకలాలను (ఆస్టరాయిడ్స్) అధ్యయనం చేస్తోంది. ఇది ‘ర్యుగు’ అనే గ్ర‌హ‌శ‌క‌లం(ఆస్టరాయిడ్) నుంచి శాంపిళ్లను సేకరించి ఒక స్పేస్ క్యాప్సూల్ ద్వారా వాటిని 2020 సంవత్సరంలో భూమికి పంపించింది. వాటిపై పరిశోధనలు చేసిన జపాన్ లోని ఓకాయామా వర్సిటీ శాస్త్రవేత్తలు ..ఆ శాంపిళ్ళలో 20 అమైనో యాసిడ్ లు ఉన్నట్లు గుర్తించారు. మానవ శరీరంలోనూ అమైనో యాసిడ్ లు ఉంటాయి. అమైనో యాసిడ్ అణువులు కలిసి శరీర నిర్మాణానికి అత్యంత కీలకమైన ప్రోటీన్లు ఏర్పడుతాయి. మనం తినే అన్నం జీర్ణం కావడానికి, పిల్లల పెరుగుదలకు, శరీర కనజాలానికి మరమ్మతులు చేసేందుకు అమైనో యాసిడ్స్ అత్యంత అవసరం.మన శరీరానికి శక్తి వనరుగా ఇవి ఉపయోగపడతాయి. ఇంత కీలకమైన అమైనో యాసిడ్స్ .. ‘ర్యుగు’ గ్రహ శకలం శాంపిళ్ళలో ఉండటం అనేది సంచలన విషయమే. అందుకే దాని శాంపిళ్ళను పరిశోధనల కోసం ఇస్తామంటూ జపాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనకు 40 దేశాలు స్పందించాయి. తమకు అంటే తమకు వాటిని కేటాయించాలని విజ్ఞప్తులు చేశాయి. వాటిలో 12 దేశాలనే ఎంపిక చేసిన జపాన్.. ఆయా దేశాలకు గ్రహ శకలం శాంపిళ్ళు అందజేసింది.

ఏం చేస్తారు ?

భూమిపైకి జీవం మొద‌ట ఎలా చేరింది? ఇది ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని ప్ర‌శ్నే. ఈ గుట్టు విప్పేందుకు ..‘ర్యుగు’ గ్రహ శకలం శాంపిళ్ళ నుంచి కొన్ని ఆధారాలు లభించవచ్చని ఆశిస్తున్నారు. “ర్యుగు గ్ర‌హ‌శ‌క‌లంపై అమైనో ఆమ్లాల క‌ల‌యిక వ‌ల్ల ఏర్పడే ప్రొటీన్ ఆవిష్క‌ర‌ణ ముఖ్య‌మైన‌ది. ఎందుకంటే ఉల్క‌ల‌లాగా రుగ్యు గ్ర‌హ‌శ‌క‌లం భూమిని ఢీకొట్ట‌లేదు. అంటే జీవం మూలాలు అంత‌రిక్షంలో ఏర్ప‌డ్డాయ‌ని దీని వ‌ల్ల అర్థ‌మ‌వుతోంది” అని రిసెర్చర్లు అంటున్నారు.ఉల్క‌ల‌తో స‌హా మాన‌వాళికి అందుబాటులో ఉన్న ఏదైనా స‌హ‌జ న‌మూనాలో ర్యుగు న‌మూనా అత్యంత ప్రాచీన ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంద‌ని జ‌పాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేష‌న్ ఏజెన్సీ పేర్కొంది. భూమిపై జీవం మూలం అంత‌రిక్షం నుంచే వ‌చ్చింద‌నే దానికి ఈ న‌మూనా నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌ని తెలిపింది.

Tags  

  • asteroid
  • hayabusa 2

Related News

Asteroid: అస్టారాయిడ్ 2021 క్యూఎమ్ 1 గురించి శాస్త్రవేత్తల ప్రకటన.. ఏం అన్నారంటే?

Asteroid: అస్టారాయిడ్ 2021 క్యూఎమ్ 1 గురించి శాస్త్రవేత్తల ప్రకటన.. ఏం అన్నారంటే?

2021 ఆగస్టు 28 అమెరికా, అరిజోనాలోని టక్సన్ కు ఉత్తరాన ఉన్న మౌంట్ లెమన్ అబ్జర్వేటరీ నుంచి ఒక విషయం శాస్త్రవేత్తలను అలర్ట్ చేసింది.

  • Asteroid and Life: భూమిపై జీవం ఎలా పుట్టింది.. పరిశోధనలో బయటపడిన సంచలన విషయాలు?

    Asteroid and Life: భూమిపై జీవం ఎలా పుట్టింది.. పరిశోధనలో బయటపడిన సంచలన విషయాలు?

  • 1,600-Feet Asteroid:భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఈఫిల్ టవర్ కంటే పెద్దది!!

    1,600-Feet Asteroid:భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఈఫిల్ టవర్ కంటే పెద్దది!!

  • Dinosaur Extinction : డైనోసార్ల అంతం గుట్టురట్టు.. 80.9 కిలోమీటర్ల భారీ గ్రహశకలం  ఢీకొనడం వల్లే..!!

    Dinosaur Extinction : డైనోసార్ల అంతం గుట్టురట్టు.. 80.9 కిలోమీటర్ల భారీ గ్రహశకలం ఢీకొనడం వల్లే..!!

Latest News

  • Maharashtra : నేడు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

  • Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

  • Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

  • Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: