World War III : మూడో ప్రపంచ యుద్ధం.. ఛాట్ జీపీటీ భయంకర జోస్యం
World War III : మూడో ప్రపంచ యుద్ధం అంటే అందరూ హడలిపోతుంటారు.
- By Pasha Published Date - 02:02 PM, Sun - 28 January 24
World War III : మూడో ప్రపంచ యుద్ధం అంటే అందరూ హడలిపోతుంటారు. ఎందుకంటే వరల్డ్ వార్ మరోసారి జరిగితే ప్రాణనష్టం భారీగా ఉంటుంది. గాజాపై ఇటీవల ఇజ్రాయెల్ దాడిచేస్తేనే 26వేల మంది చనిపోయారు. అలాంటిది ప్రపంచ దేశాలన్నీ వరల్డ్ వార్‌కు వెళితే ఎన్ని లక్షల మంది చనిపోతారో మనం అంచనా వేసుకోవచ్చు. ఈనేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ)లో శక్తివంతైమనదిగా భావించే ఏఐ బాట్ ‘ఛాట్-జీపీటీ’ మూడో ప్రపంచ యుద్ధంపై(World War III) భయంకరమైన జోస్యం చెప్పింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
We’re now on WhatsApp. Click to Join.
ఇండియా వర్సెస్ పాక్
భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే రెండుసార్లు యుద్ధం జరిగింది. పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనపడినప్పటి నుంచి పరిస్థితులు సద్దుమణిగాయి. అణ్వస్త్ర సామర్థ్యాలున్న ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఏవైనా ఉద్రిక్తతలు ఏర్పడితే ప్రపంచమంతా టెన్షన్ పడుతుంటుంది. అందుకే ఇక్కడి నుంచి కూడా ప్రపంచయుద్ధం ప్రారంభం కావచ్చని చాట్ జీపీటీ అంచనా వేస్తోంది.
సిరియా
గత 7 దశాబ్దాల్లో ఎక్కువ యుద్ధాలు జరిగిన గడ్డ మిడిల్ ఈస్ట్ ప్రాంతం. ఈ ఏరియాలోనే ఆయిల్ రిచ్ అరబ్ దేశాలు ఉన్నాయి. ఆయిల్ మార్కెట్‌పై పట్టుకోసం, ఆయిల్ మార్కెట్లో డాలర్ ఉనికి కోసం అమెరికా పాకులాడుతోంది. ప్రపంచంలో అమెరికాకు ఎక్కువ మిలిటరీ బేస్‌లు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈప్రాంతంలోని సిరియా కేంద్రంగా వరల్డ్ వార్ మొదలయ్యే రిస్క్ ఉందని ఛాట్ జీపీటీ చెబుతోంది. ఈ దేశంలో ఇప్పటికే అమెరికా, ఇరాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల సైన్యాలు ఉన్నాయి. ఇక్కడున్న ఏ దేశ సైన్యంపై దాడి జరిగినా.. ప్రతీకార దాడులు జరిగే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది అణు యుద్ధానికి కూడా దారితీయొచ్చు.
ఉత్తర కొరియా వర్సెస్ దక్షిణ కొరియా
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య తాజాగా ఇవాళ కూడా సరిహద్దు ఘర్షణ జరిగింది. ప్రత్యేకించి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని దక్షిణ కొరియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉత్తర కొరియాలో మీడియాకు స్వేచ్ఛ లేకపోవడంతో ఆ దేశంలో ఏం జరుగుతోందో బయటికి తెలియడం లేదు. చైనా, రష్యాల నుంచి ఉత్తర కొరియాకు సైనిక సహకారం లభిస్తోంది. దీంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లను ఢీకొట్టేందుకు ఉత్తర కొరియా రెడీ అవుతోంది. అందుకే కొరియా ద్వీపకల్పం నుంచి వరల్డ్ వార్ మొదలు కావొచ్చని ఛాట్ జీపీటీ అంచనా వేస్తోంది.
దక్షిణ చైనా సముద్రం
చైనా, దాని పొరుగుదేశాలు దక్షిణ చైనా సముద్ర జలాలపై పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నాయి. చైనా పొరుగుదేశాలకు సపోర్ట్ చేస్తామంటూ అమెరికా ప్రకటనలు చేస్తోంది. దీంతో అమెరికాతో తలపడేందుకు సిద్ధమని చైనా అంటోంది. చైనా పొరుగుదేశాలకు పెద్దఎత్తును అమెరికా ఆయుధాలను విక్రయిస్తోంది. ఈ పరిణామాలు మరో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని ఛాట్ జీపీటీ అంచనా వేసింది.
తైవాన్ జలసంధి
చైనా, దాని పొరుగుదేశం తైవాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. దీనిపై అమెరికా దృష్టి పెట్టడంతో మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ఈ ప్రాంతం ఏ సమయంలోనైనా మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్రం కావచ్చు.
ఈస్ట్ యూరప్
తూర్పు ఐరోపా ప్రాంతం చాలా కీలకమైంది. రష్యా, ఉక్రెయిన్, నాటో దేశాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం యుద్ధం నడుస్తోంది. నాటో దేశాలతోనూ రష్యాకు వివాదాలు నడుస్తున్నాయి. దీంతో తూర్పు ఐరోపాలో ఉద్రిక్తతలు బాగా పెరుగుతున్నాయి. ఇది ఏ సమయంలోనైనా మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయని ఛాట్ జీపీటీ అంటోంది.
Related News
World War III : అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం : జెలెన్స్కీ
World War III : ఈ మధ్యకాలంలో మూడో ప్రపంచ యుద్ధం భయాలు పెరిగాయి.