రెండు నెలల పాటు యజమాని సమాధి దగ్గరే పిల్లి. వైరల్ వీడియో
పెంపుడు జంతువులకు బర్త్‌డే పార్టీలు చేసే వీడియోలు ఫోటోలు చూసి అబ్బో అనుకుంటాం. అవే పెంపుడు జంతువులు చనిపోతే వాటికి మనుషుల్లానే అంత్యక్రియలు నిర్వహించి సాగనంపిన ఘటనలూ చదివి ఉంటాం. ఇంతకీ చాలామందికి ఎందుకు జంతువులంటే అంత ప్రేమ?
- By Hashtag U Published Date - 03:07 PM, Fri - 14 January 22

పెంపుడు జంతువులకు బర్త్‌డే పార్టీలు చేసే వీడియోలు ఫోటోలు చూసి అబ్బో అనుకుంటాం. అవే పెంపుడు జంతువులు చనిపోతే వాటికి మనుషుల్లానే అంత్యక్రియలు నిర్వహించి సాగనంపిన ఘటనలూ చదివి ఉంటాం. ఇంతకీ చాలామందికి ఎందుకు జంతువులంటే అంత ప్రేమ?
పెంపుడు జంతువుల విషయంలో చాలా మంది అనుసరించే వైఖరి ఆశ్చర్యకరంగా ఉంటుంది. వాటిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. తాము కన్న పిల్లలను, తమను కన్న తల్లి తండ్రులను దూరంగా ఉంచుకున్నా సరే పెంపుడు జంతువుల విషయంలో మమకారం పెంచుకుని వాటికి సేవలు చేస్తూ ఉంటారు. ఇక తమ తర్వాత అవి ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంలో భాగంగా వాటికి ఆస్తులు కూడా రాస్తూ ఉంటారు. తాజాగా సెర్బియాలో ఒక పిల్లి అనుసరించిన వైఖరి ఆశ్చర్యపరిచింది.
https://twitter.com/LavBosniak/status/1480670982935392263
చాలా వరకు కూడా మనుషులు కుక్కలను పెంపుడు జంతువులుగా చూస్తూ ఉంటారు. కాని పిల్లి విషయంలో మాత్రం అంత ఆసక్తి ఉండదు. కుక్క ఉన్నంత నమ్మకంగా పిల్లి ఉండదని అంటూ ఉంటారు. కాని ఒక పిల్లి మాత్రం తన యజమాని విషయంలో చూపిన విశ్వాసం ఆశ్చర్యపరిచింది. సెర్బియాకు చెందిన షేక్ ముఅమర్ జుకోర్లీ పెంపుడు పిల్లి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. గత ఏడాది నవంబర్ లో తన యజమాని ప్రాణాలు కోల్పోయిన తర్వాతి నుంచి ఆ పిల్లి సమాధి దగ్గరే ఉంది.
https://twitter.com/LavBosniak/status/1458022583211859968
నవంబర్ 6, 2021న యజమాని ప్రాణాలు కోల్పోగా రెండు రోజుల తర్వాత అంత్యక్రియలు పూర్తి చేసారు. అప్పటి నుంచి ఆ పిల్లి యజమాని సమాధి దగ్గరే ఉంటూ అతని కోసం ఎదురు చూస్తుంది. యజమాని శవం మీద మంచు పేరుకుపోయినా సరే ఆ చలిలో కూడా పిల్లి అక్కడే ఉండిపోయింది. లావాడర్ అనే ట్విట్టర్ యూజర్ చనిపోయిన యజమాని సమాధిపై దిగులుగా కూర్చున్న పెంపుడు పిల్లి ఫోటో ని షేర్ చేసారు. అంత్యక్రియలు జరిగిన రెండు నెలల తర్వాత సమాధి దగ్గర పిల్లి ఉండటం నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది. సెర్బియా మాజీ ముఫ్తీ అయిన షేక్ ముఅమర్ జుకోర్లీ నవంబర్ 6, 2021న గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
IT'S COLD OUT THERE, SOMEONE ADOPT HIM PLEASE 😭😭
— イキマー 𓃠 (@jjoee___) January 12, 2022