Impregnating Cheat : ప్రెగ్నెంట్ చేస్తే రూ.13 లక్షల ఆఫర్.. మాఫియా గుట్టురట్టు
Impregnating Cheat : గర్భధారణ.. ఎంతో పవిత్రమైన అంశం. కొందరు నీచులు ఈ పవిత్రమైన పదాన్ని కూడా దగాకోరు దందా కోసం వాడుకున్నారు.
- Author : Pasha
Date : 01-01-2024 - 8:35 IST
Published By : Hashtagu Telugu Desk
Impregnating Cheat : గర్భధారణ.. ఎంతో పవిత్రమైన అంశం. కొందరు నీచులు ఈ పవిత్రమైన పదాన్ని కూడా దగాకోరు దందా కోసం వాడుకున్నారు. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’ పేరుతో ముఠాను నడిపారు. పాపం పండింది.. చివరకు ఈ ముఠాలోని 8 మంది సభ్యులు బీహార్‌లోని నవాడాలో పోలీసులకు దొరికారు. వారిని పోలీసులు విచారించగా ముఠా గుట్టుమట్లు బయటపడ్డాయి. ఈ ముఠా సభ్యులంతా కలిసి ‘ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’ పేరుతో వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా పురుషులను సంప్రదించే వారట. ఈ సర్వీస్ చేస్తే లక్షలు ఇస్తామని ఊరించేవారట. మాటలు నమ్మి.. ఆసక్తి కనబరిచే వ్యక్తుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 799 వసూలు చేసేవారు.
We’re now on WhatsApp. Click to Join.
రిజిస్ట్రేషన్ ఫీజు అందాక వారికి మహిళల ఫోటోలను పంపిస్తారు. వారిలో నచ్చిన మహిళల ఫొటోలను సెలక్ట్ చేశాక.. రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు. ఆ తర్వాత వారు ఎంపిక చేసుకున్న మహిళను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 13 లక్షలు.. అలా చేయలేకపోయినా రూ. 5 లక్షలు ఇస్తామని ముఠా సభ్యులు నమ్మబలుకుతారు. అనంతరం తమకు డబ్బులు చెల్లించిన వారి ఫోన్ కాల్స్ లిఫ్టు చేయకుండా ముఠా సభ్యులు బిచాణా ఎత్తేస్తారు. ఇలా చాలామందికి లక్షలాది రూపాయలు కుచ్చుటోపీ(Impregnating Cheat) పెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను విచారించిన పోలీసులు.. ప్రధాన సూత్రదారితో సహా మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.ఈ కేసులో పట్టుబడిన నిందితులు దేశవ్యాప్తంగా సైబర్ సిండికేట్‌లో భాగమని పోలీసులు తెలిపారు.