Deepthi Sunaina: దీప్తి షాకింగ్ డెసిషన్.. షణ్ముఖ్ తో బ్రేకప్!
బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ఇద్దరు గత కొంతకాలంగా రిలేషన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలోయాక్టివ్ ఉన్న నెటిజన్స్ అందరికీ దాదాపుగా వీళిద్దరి ప్రేమ వ్యహరం
- By Balu J Published Date - 12:56 PM, Sat - 1 January 22

బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ఇద్దరు గత కొంతకాలంగా రిలేషన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలోయాక్టివ్ ఉన్న నెటిజన్స్ అందరికీ దాదాపుగా వీళిద్దరి ప్రేమ వ్యహరం గురించి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో దీప్తి అనూహ్య నిర్ణయం తీసుకొని నెటిజన్స్ ఆశ్చర్యపర్చింది. తాను ఇక షణ్ముక్ తో కలిసి ఉండలేనని సోషల్ మీడియా వేదికగా తేల్చి చెప్పేసింది.
‘‘ఎంతో ఆలోచించిన తర్వాత నేను, షణ్ముఖ్ పరస్పర అంగీకారంతో ప్రేమ బంధం నుంచి విడిపోయి.. మా దారులు మేము చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. బ్రేకప్ నిర్ణయం మా మధ్య ఎంతోకాలం నడుస్తోంది. ఈక్రమంలోనే మేమిద్దరం కలిసి ఉండటానికి ఎంతో ప్రయత్నించి.. నిజ జీవితాన్ని విస్మరించాం. మా దారులు వేరని అర్థమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు మీ అండ ఎంతో అవసరం. దయచేసి మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరని కోరుకుంటున్నాం’’ అని దీప్తి తెలిపారు.
కాగా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్న షణ్ముఖ్.. సిరితో ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. ఫ్రెండ్ అంటూనే హగ్గులు, ముద్దుల దాకా వెళ్లాడు. హగ్గులు నచ్చడం లేదని సిరి తల్లి చెప్పినప్పటికీ వీళ్లిద్దరూ పద్ధతి మార్చుకోలేదు. ఈ వైఖరి దీప్తి సునయనకు కూడా నచ్చలేదట. షణ్ముక్ వ్యవహరంపై నెటిజన్స్ కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దీప్తి షణ్ముక్ కు బ్రేకప్ చెప్పేసింది!