Electric Aircraft:విద్యుత్‌తో నడిచే తొలి విమానమిదే.. ప్రత్యేకతలివే..!
ప్రపంచం పర్యావరణ రహిత ఇంధన వినియోగంపై దృష్టిసారించింది. దీంతో కాలుష్య రహిత వాహనాల తయారీ కోసం అనేక అనేక ఆటోమొబైల్ కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.
- By Hashtag U Published Date - 03:29 PM, Fri - 30 September 22

ప్రపంచం పర్యావరణ రహిత ఇంధన వినియోగంపై దృష్టిసారించింది. దీంతో కాలుష్య రహిత వాహనాల తయారీ కోసం అనేక అనేక ఆటోమొబైల్ కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఆధారిత వాహనాలను తయారు చేస్తూ భవిష్యత్‌లో స్వచ్ఛమైన వాతావరణానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కార్లు, బస్సులు, స్కూటర్లు ఇలా విద్యుత్‌తో రోడ్డుపై నడిచే వాహనాలే కాదు.. విద్యుత్‌తో గాల్లో దూసుకెళ్లే విమానాలు కూడా తయారవుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు ‘ఆలిస్’.
అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 8 నిమిషాల పాటు గగన విహారం చేసింది. 3500 అడుగుల ఎత్తులో దీన్ని విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. దీన్ని ఈవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థ తయారు చేసింది. ఇది గరిష్టంగా 200 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఆలిస్ విమానంలో ఆరు సీట్లతో ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, 9 సీట్లతో కమ్యూటర్, ఈ కార్గో పేరిట మూడు వేరియంట్లు ఉన్నాయి. ప్రఖ్యాత కార్గో సంస్థ డీహెచ్ఎల్ కూడా తమ సరకు రవాణా కోసం 12 ఆలిస్ ఈ కార్గో రకం విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది. అమెరికాకు చెందిన కేప్ ఎయిర్, గ్లోబర్ క్రాసింగ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా పదుల సంఖ్యలో ఈ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి.
Related News

Xiaomi Mini Electric Car : రూ. 3.47 లక్షలకే షావొమి మినీ ఎలక్ట్రిక్ కారు
ఈ షావొమా మినీ ఎలక్ట్రిక్ కారు (Xiaomi Mini Electric Car)ను ఫస్ట్ ఆటో వర్క్స్ తమ బెస్టూన్ బ్రాండ్ కింద రూపొందించింది.