Super Earth: భూమిని పోలిన మరో గ్రహం.. అక్కడ ఏడాదికి 11 రోజులే!!
మన భూమిని పోలిన గ్రహాలు విశ్వంలో ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నారు.
- By Hashtag U Published Date - 07:00 AM, Fri - 26 August 22
యావత్ విశ్వంలో మన భూమి వెరీ వెరీ స్పెషల్.
మన భూమిని పోలిన గ్రహాలు విశ్వంలో ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నారు.
ఈక్రమంలో మరో భూమిని
మాంట్రియల్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం గుర్తించింది. దాని పేరు “TOI-1452 b”. అది మన భూమికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అది సైజులో మన భూమికంటే 70 రెట్లు పెద్దగా ఉంటుంది.
ఈ కొత్త భూమి రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని.. ఇక్కడ లోతైన మహాసముద్రాలు ఉంటాయని అధ్యయనంలో వెల్లడైంది. ఈ
కొత్త భూమిపై ఒక సంవత్సరం అంటే కేవలం 11 రోజులేనట.
ఈ సూపర్ ఎర్త్‌పై నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
“TOI-1452 b” అనేది మన భూమి కన్నా ఐదు రెట్లు బరువైనది. దీనిలో ఓ లోతైన మహాసముద్రం ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రహం మొత్తం బరువులో దాదాపు 30 శాతం వరకు మహా సముద్రం ఉంది. ఇందుకు పూర్తి భిన్నంగా.. మనం నివసిస్తున్న భూమిలో 70 శాతం వరకు నీరు ఉన్న సంగతి తెలిసిందే. మన భూమి బరువులో కేవలం 1 శాతం మాత్రమే నీటి ప్రాంతం ఉంది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ “నాసా” (NASA) ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. నీరు, భూమి నిష్పత్తిని మన సౌర వ్యవస్థలోని వాటరీ మూన్స్‌తో పోల్చినపుడు, మంచు ఫలకాల క్రింద మహా సముద్రాలు ఉన్నట్లుగా ఈ మహాభూమిలోని సముద్రం కూడా ఉంది. ఈ మహాభూమి తన నక్షత్రం చుట్టూ భ్రమణాన్ని 11 రోజుల్లో పూర్తి చేస్తుంది. కాబట్టి మనకు ఒక సంవత్సరం అంటే ఈ మహాభూమి మీద సంవత్సరం అంటే 11 రోజులు మాత్రమే.
మన సూర్యుడి నుంచి శుక్ర గ్రహానికి ఏ స్థాయిలో కాంతి అందుతోందో అదే స్థాయిలో ఈ మహాభూమికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుంది. ఈ మహాభూమి తన రెండో నక్షత్రం చుట్టూ తిరగడానికి దాదాపు 1,400 సంవత్సరాలు పడుతుందట..ఎంత వింతగా ఉందో కదా..ఈ మహాభూమిలో నీరు ఉన్నట్లు ఖచ్చితత్వంతో తెలియాలంటే మరికొన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.
Related News
Super Earth: జీవరాశులున్న మరో ‘సూపర్ ఎర్త్’ గుర్తించారహో.. !!
భూమి ఒక గ్రహం.. ఈ విశ్వంలో భూమిలాంటి గ్రహాలు మరెన్నో ఉన్నాయి. వాటిలో కనీసం కొన్ని చోట్ల మనుషులను పోలిన జీవరాశులు ఉన్నాయనే సందేహం శాస్త్ర ప్రపంచంలో ఉంది.