AI – Undress Photos : ఏఐలో అశ్లీల రాకెట్.. ‘అన్‌డ్రెస్’ యాప్స్, సైట్స్ కలకలం
AI - Undress Photos : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్(ఏఐ) టెక్నాలజీ విచ్చలవిడితనానికి దారితీస్తోంది. సమాజంలో చెడు పోకడలకు బాటలు వేస్తోంది.
- Author : Pasha
Date : 09-12-2023 - 9:02 IST
Published By : Hashtagu Telugu Desk
AI – Undress Photos : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్(ఏఐ) టెక్నాలజీ విచ్చలవిడితనానికి దారితీస్తోంది. సమాజంలో చెడు పోకడలకు బాటలు వేస్తోంది. ఏకంగా మహిళా లోకంపై దాడి చేసే ఏఐ యాప్‌లు, వెబ్‌సైట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్‌ను ఉపయోగించి ఫొటోలలో మహిళలను వివస్త్రలుగా చేసే యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఒక్క సెప్టెంబరులోనే ప్రపంచవ్యాప్తంగా 2.4 కోట్ల మంది సందర్శించారట. సోషల్ నెట్‌వర్క్ విశ్లేషణ సంస్థ గ్రాఫికా ఈవివరాలను వెల్లడించింది. దీన్నిబట్టి ఏఐ టెక్నాలజీ అశ్లీల కంటెంట్‌ను ఎలా పెంచుతోందో, ప్రజలను అశ్లీలతకు ఎలా చేరువ చేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ట్విట్టర్ (X), Reddit సహా ఇతరత్రా సోషల్ మీడియా సైట్లలో అన్‌డ్రెస్సింగ్ యాప్‌ల యాడ్స్ బాగా పెరుగుతున్నాయని గ్రాఫికా వివరించింది.
We’re now on WhatsApp. Click to Join.
డీప్ ఫేక్ వీడియోల బ్యాన్‌పై ఫోకస్ చేస్తున్న భారత ప్రభుత్వం.. ఫొటోలలో మహిళలు, పిల్లలను వివస్త్రలుగా చేసే యాప్‌లు, వెబ్‌సైట్‌లపైనా బ్యాన్ విధించాల్సిన అవసరం ఉంది. అవి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో ఇచ్చే ఈరకమైన యాడ్స్‌ను కూడా బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ టెక్నాలజీ కంపెనీలు మహిళలను కించపరిచే అవకాశం కలిగిన యాప్స్, వెబ్ సైట్స్, సాఫ్ట్ వేర్‌లను డెవలప్ చేయకుండా భారత సర్కారు నిలువరించాలి. ఈమేరకు వాటికి మార్గదర్శకాలను జారీ చేయాలి. డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీని సృష్టించడాన్ని నిషేధించే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: 81516 Crore Debt : విద్యుత్ శాఖ అప్పు రూ.81,516 కోట్లు
ఈ ఏడాది నవంబరులో అమెరికాలోని ఒక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నార్త్ కరోలినాకు చెందిన పిల్లల మనోరోగ వైద్యుడు ఒకరికి 40 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆయన ‘అన్ డ్రెస్’ యాప్‌లను(AI – Undress Photos) వాడి.. తన వద్ద చికిత్సకు వచ్చిన పిల్లలను అశ్లీలంగా చేసి చూశారని నిరూపితం అయింది. దీంతో కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ తరహా కఠిన శిక్షలను మన దేశంలోనూ అమల్లోకి తేవాల్సిన అవసరం ఉంది.