Anirudh – Kavya Maran : కావ్య తో పెళ్లి.. అనిరుధ్ క్లారిటీ ఇచ్చాడుగా !
Anirudh - Kavya Maran : ఇద్దరూ ఇటీవల ఓ మ్యాచ్ సమయంలో కలిసి కనిపించడం, అలాగే అనిరుధ్ తరచూ SRH మ్యాచ్‌లకు హాజరవుతుండడం వల్ల ఈ రూమర్స్ కు బలం చేకూర్చినట్లు అయ్యింది.
- By Sudheer Published Date - 07:37 PM, Sat - 14 June 25

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ (Anirudh – Kavya Maran Wedding) పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలతో అభిమానులు, నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. ఇద్దరూ ఇటీవల ఓ మ్యాచ్ సమయంలో కలిసి కనిపించడం, అలాగే అనిరుధ్ తరచూ SRH మ్యాచ్‌లకు హాజరవుతుండడం వల్ల ఈ రూమర్స్ కు బలం చేకూర్చినట్లు అయ్యింది.
Stone attack : పొదిలి వైసీపీ రాళ్ల దాడి ఘటన.. మరో 15 మంది అరెస్ట్
ఈ తరుణంలో ఈ వార్తలపై స్వయంగా అనిరుధ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఒక స్పష్టత క్లారిటీ ఇచ్చారు. “పెళ్లా? ఈ రూమర్స్ కాస్త ఆపండి” అంటూ సరదాగా ట్వీట్ చేశారు. అనిరుధ్ టీమ్ కూడా ఈ రూమర్స్‌ను ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అనిరుధ్ – కావ్యలు మంచి స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేసింది. వీరి మధ్య ఎటువంటి వ్యక్తిగత సంబంధం లేదని తెలిపింది. ఈ రూమర్స్‌తో అనవసరంగా ఇద్దరి వ్యక్తిగత జీవితాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అనిరుధ్ ఈ క్లారిటీ ఇవ్వడం అవసరమైంది. సెలబ్రిటీలను చూసి తప్పుడు ఊహాగానాలు చేయకుండా నిజమెన్నదో తెలుసుకుని మాత్రమే షేర్ చేయాలని అభిమానులకు గుర్తు చేస్తున్నట్టే అనిపిస్తోంది.
Marriage ah? lol .. Chill out guys 😃 pls stop spreading rumours 🙏🏻
— Anirudh Ravichander (@anirudhofficial) June 14, 2025