VietJet Passengers : 100 మంది..1 విమానం..12 గంటలు
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో "వియత్‌జెట్" (VietJet Passengers) ఎయిర్‌లైన్స్ విమానం కోసం వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురైంది. వియత్ జెట్ విమానం కోసం ఎదురుచూసి చూసి .. ఆ ప్యాసింజర్ల కళ్ళకు కాయలు కాశాయి.
- Author : Pasha
Date : 26-05-2023 - 11:09 IST
Published By : Hashtagu Telugu Desk
వాళ్ళు వెళ్లే విమానం టైం గురువారం రాత్రి 11 గంటలు !! అయితే శుక్రవారం ఉదయం 11 గంటలైనా ఆ విమానం రాలేదు. దీంతో వాళ్లంతా ఎయిర్ పోర్ట్ లోనే ఎదురు చూస్తూ ఉండిపోయారు. కొంతమంది అక్కడే కూర్చుండిపోగా .. ఇంకొంతమంది నిద్రపోయారు. మరికొంతమంది ఇళ్లకు వెళ్లిపోయారు. బాగా డబ్బున్న వాళ్ళు వేరే విమానంలో బయలుదేరారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో “వియత్‌జెట్” (VietJet Passengers) ఎయిర్‌లైన్స్ విమానం కోసం వెళ్లిన వారికి ఈ చేదు అనుభవం ఎదురైంది. వియత్ జెట్ విమానం కోసం ఎదురుచూసి చూసి .. ఆ ప్యాసింజర్ల కళ్ళకు కాయలు కాశాయి.
Also read : Amazon Forest: అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 17 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన నలుగురు చిన్నారులు..!
ఎంక్వైరీ కౌంటర్ కు వెళ్లి అడిగితే..
ఎంక్వైరీ కౌంటర్ కు వెళ్లి అడిగితే విమానంలో సాంకేతిక సమస్య ఉందని మొదట చెప్పారు .. ఆ తర్వాత అది కూడా చెప్పడం మానేశారు.. దీంతో ట్విట్టర్ వేదికగా ఆ విమానం ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. ఒక టైం టేబుల్ పాటించలేని “వియత్‌జెట్” (VietJet Passengers) ఎయిర్‌లైన్స్ లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఎలాంటి సదుపాయం కల్పించలేదని మండిపడ్డారు. విమానం ఎప్పటి వరకు సిద్ధమవుతుందని ప్రశ్నించారు. “వియట్‌జెట్ లైసెన్స్‌ను రద్దు చేయండి” అని కోరుతూ ఒక ప్రయాణికుడు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. “వియత్‌జెట్” (VietJet) ప్రధాన కార్యాలయం హనోయిలోని బా దిన్హ్ జిల్లాలో ఉంది. దీని విమాన సేవలు 2011 డిసెంబర్ 25న స్టార్ట్ అయ్యాయి.