Best Stocks: ఈ షేర్లు మీ దగ్గర ఉన్నాయా అయితే మీకు డివిడెండ్ల వర్షమే!
ఒక షేరులో పెట్టుబడి పెట్టిన తర్వాత మామూలుగా ధర పెరిగితే మాత్రం మూలధన లాభం వస్తుంది.
- By Anshu Published Date - 08:45 AM, Fri - 1 July 22

ఒక షేరులో పెట్టుబడి పెట్టిన తర్వాత మామూలుగా ధర పెరిగితే మాత్రం మూలధన లాభం వస్తుంది. అలా ఒక షేర్ కొనుగోలు చేసి దానిని విక్రయించే వరకు ఆ ఏట మొత్తం కంపెనీ నుంచి అందుకునే డివిడెండ్ ఆదాయం అదనపు రాబడి. ఇక మంచి డివిడెండ్లు ఇచ్చే కంపెనీలు కూడా ఉండగా ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువ డివిడెండ్ల వచ్చే కంపెనీల స్టాక్ ధరల్లో అంత త్వరగా వృద్ధి కనిపించదని తెలుస్తుంది. అంతేకాకుండా ఫిక్స్ డిపాజిట్ కు ఎక్కువ డివిడెండ్ ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక ప్రతి ఇన్వెస్టర్ తమ ఈక్విటీ పెట్టుబడుల్లో ఐదు నుండి 10% వరకు డివిడెండ్ కంపెనీలలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రాబడి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
ఆర్ ఈసీ: ఇది విద్యుత్ రంగంలో ప్రాజెక్టులకు రుణాలు అందించే సంస్థ ఇది. ఇక ఇది 2.3 పీఈకే ట్రేడ్ అవుతుంది. 13.8 డివిడెండ్ రాబడి వద్ద ప్రస్తుతం ఈ స్టాక్ ధర ట్రేడ్ అవుతుంది.
సెయిల్: ఇది మెగా స్టీల్ కంపెనీకి సంబంధించిన ప్రభుత్వ రంగం. ప్రస్తుతం ఈ షేరు ధర డివిడెండ్ రాబడి 13.5 శాతంగా ఉంటుంది
పీఎఫ్ సీ: విద్యుత్ రంగానికి రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇది. ఇక ఇది 12.2% డివిడెండ్ రాబడి అందిస్తుంది.
పీటీసీ ఇండియా: ఇక ఇది కూడా ప్రభుత్వ రంగానికి చెందిందే. ఇక దీని డివిడెండ్ ఈల్డ్ 10.4శాతం ఉంటుంది.
కోల్ ఇండియా: బొగ్గు రంగానికి సంబంధించిన ప్రభుత్వ రంగం ఇది. ఇందులో డివిడండి ఈల్డ్ 9.6 శాతం ఉంది.
పీఎన్ బీ గిల్ట్స్: ఇక ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకు సబ్సిడరీ. ఇక ఈ స్టాక్ డివిడెండ్ ఈల్డ్ 8.5 శాతం ఉంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్: ఇది ఆయిల్ కంపెనీకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో డివిడెండ్ ఈల్డ్ 8.2శాతంగా ఉంది.
ఓఎన్జీసీ: ఇది భారత్ లో అతిపెద్ద చమురు సంస్థ. దీని డివిడెండ్ రాబడి 7.8 శాతం ఉంది.
రైట్స్: ఇది రైల్వే కి సంబంధించిన సంస్థ. ఇందులో డివిడెండ్ రాబడి 7.5 శాతం ఉంది.