CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి యువతి ఫ్లయింగ్ కిస్
- Author : Sudheer
Date : 20-01-2024 - 1:42 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరుస విదేశీ పర్యటనల్లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. దావోస్ (Davos పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి..ప్రస్తుతం లండన్ (London)లో పర్యటిస్తున్నారు. నిన్న ‘థేమ్స్’ నది పాలకమండలితో పాటు పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఉన్నతాధికారులతో చర్చించారు. మూసీ నదీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. సమావేశంలో థేమ్స్ నది చరిత్ర, నది అభివృద్ధికి ఎదురైన సవాళ్లు,పెట్టుబడి, ఇంజినీరింగ్, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్‌లో మూసీ,ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్, వంటి చెరువుల ప్రాధాన్యత నిపుణులకు వివరించారు.హైదరాబాద్‌లో ఉన్న చెరువుల ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. మూసీకి పునర్‌వైభవం తీసుకువస్తే నది, చెరువులతో హైదరాబాద్ మరింత పర్యాటక ప్రాంతంగా మారుతుందని సీఎం తెలిపారు. ఇక లండన్ పర్యటనలో రేవంత్ రెడ్డిని చూసిన ఆనందంలో ఓ యువతి తన ఆనందాన్ని వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. వేదికపై రేవంత్ రెడ్డి మాట్లాడాక ఓ యువతి ఆయనకు బోకేను అందించింది. దాన్ని రేవంత్ రెడ్డి తీసుకోవడంతో ఆమె ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ రేవంత్ రెడ్డికి ఫ్లయింగ్ కిస్ (Flying Kiss) ఇచ్చింది. రేవంత్ కూడా ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు. రేవంత్ రెడ్డికి విదేశాల్లోనూ ఇంతగా ఫాలోయింగ్ ఉందా.. ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
ఆనందానికి అవధులు లేవు ఇంకా. ❤️🔥❤️🔥@revanth_anumula Anna 🥰❤️🔥#RevanthReddy #TelanganaCM pic.twitter.com/aN0ShEKM0I
— 🦁 (@TEAM_CBN1) January 20, 2024
Read Also :