Yadadri : ఈనెల 25న యాదాద్రి ఆలయం మూసివేత..ఎందుకంటే..!!
ఈనెల 25వ తేదీనా యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు
- By hashtagu Published Date - 07:27 PM, Mon - 17 October 22

ఈనెల 25వ తేదీనా యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8.50 నుంచి మరుసటి రోజు ఉదయం 8గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయం మూసివేస్తున్నందున 25వ తేదీ నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 26న నిర్వహించే శతపట్టాభిషేకం, సహస్రనామార్చనను కూడా రద్దు చేశారు. 26వ తేదీన ఉదయం సూర్య గ్రహణం విడిచిన తర్వాత ఆలయ సంప్రోక్షణ నిర్వహించి 10:30గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత యథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు అవుతాయి. 27ఏళ్ల తర్వాత దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడటం విశేషం.