HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Will Telangana Congress Be Ruined Even With Manikrao Thakre Arrival

Manikrao Thakre: ఠాక్రే రాకతోనైనా ‘తెలంగాణ కాంగ్రెస్‌’ గాడినపడేనా?

  • Author : Balu J Date : 10-01-2023 - 12:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Secret Manifesto
Tcongress

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల ను ఎదుర్కొంటోంది. క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్‌ ఉన్న ప్పటికి.. నిత్యం జనంలో ఉండే పరిస్థితి లేకుండా పోతుందనే విమర్శలను ఎదుర్కొంటోంది. పార్టీ నాయకుల మధ్య కల హాలు, చిన్న చిన్న పంచాయతీల వల్ల అధికార పార్టీపై సరైన విధంగా యుద్ధం చేయడం లేదని, ఒక వేళ ప్రజా సమస్యలపై టీ పీసీసీ కార్యక్రమాలు ఇచ్చినా పూర్తిగా విజయవంతం చేయ డంలో విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమమయంలో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌గా కాంగ్రెస్‌ అధిష్టానం నియమించిన మాణిక్‌రావు ఠాక్రే వ్యూహాం ఏ మేరకు పని చేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నాయి. ‘ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌కు ఠాక్రే ఇచ్చే శస్త్ర చికిత్స ఏ మేరకు ఫలిస్తుంది. ఆయన వ్యూహాంతో పార్టీ నాయకులందరు ఏకతాటికి వస్తారా..? కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారా..? ‘ అని సొంత పార్టీ నాయకుల్లోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే కలహాలకు , గ్రూప్‌ తగాదాలకు నిలయమని, ఒకరంటే మరొకరికి గిట్టని వ్యహారం ఉండటమే కాకుండా.. ఒకరు ఎడ్డెం అంటే.. మరొకరు తెడ్డెం అంటారనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.

ఇప్పటీ వరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మానిక్యం ఠాగూర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను సమన్వయం చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు రావడంతో.. ఆయన్ను పార్టీ అధిష్టానం ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించింది. మానిక్యం ఠాగూర్‌ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి మాణిక్‌రావు ఠాక్రేన్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న ఠాక్రే బుధవారం మొదటిసారిగా రా ష్ట్రానికి రానున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో పార్టీ నేతలతోనే విడీ విడిగా ఠాక్రే సమావేశమై అందరి అభిప్రాయాలను తీసుకుని తిరిగి గురువారం ఢిల్లికి వెళ్లనున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీకి చెందిన పలువురు సీని యర్లు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్‌ ఉపా ధ్యక్షులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర నాయకులతో వేర్వేరుగా సమావేశమై.. పార్టీ బలోపే తా నికి తీసుకునే అంశాలు, నేతల మధ్య నెలకొన్న పంచా యతీలపై కిందిస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రెండు గ్రూప్‌లుగా విడి పోయారు. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో పలువురు సీనియర్లు తిరుగుబాటు చేయగా.. పార్టీ అధిష్టానం వెనువెంటనే తేరుకుని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ను రంగంలోకి దింపి టీ పీసీసీలో నెలకొన్న అసంతృప్తిని తాత్కాలికంగా చల్లబర్చారు. డిగ్గీ రాజా హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర పార్టీ నేతల అభి ప్రాయా లను తీసుకుని ఢిల్లికి వెళ్లి అధిష్టానానికి నివేదిక ఇచ్చా రు. ఆ తర్వాతనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మానిక్యం ఠాగూర్‌ను తప్పించి మాణిక్‌రావు ఠాక్రేకు తెలం గాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి గ్రూప్‌ తగాదాలు, నాయకుల మధ్య మనస్ఫర్దలు కొత్తేమి కానప్పటికీ .. ఇప్పుడున్న పంచాయతీలు మాత్రం చికాకు కలిగిస్తున్నాయని కిందిస్థాయి కేడర్‌ అసంతృప్తికి వ్యక్తం చేస్తోంది. ఒక వైపు సీఎం కేసీఆర్‌ తన పార్టీని మరింత బలోపేం చేసుకుంటు తిరిగి మూడోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో వైపు తెలంగాణలో గత ఎన్నికల వరకు అంతగా బలం లేని బీజేపీ.. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామనేని సవాల్‌ విసురుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు నిత్యం జనంలో ఉండే విధంగా కార్యాచరణతో బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీ నేతలు వివిధ సమ స్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో బలంగా ఉండి ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులు గొడవలతో ప్రజల్లో నమ్మకం పొగట్టుకునే పరిస్థితికి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. సొంత ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకుంటనే అధికారం సాధ్యమని పలువురు కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడు తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Manikrao Thakre
  • TCongress

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd