Alleti Maheshwar Reddy: మౌనమేల ఏలేటి?
ఏలేటి ఈ ఎపిసోడ్‌లో కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అగ్రెసివ్ కామెంట్స్ చేసిన వ్యక్తి..ఉన్నట్టుండి సైలెంట్ అవ్వడంతో..ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.
- Author : manojveeranki
Date : 23-08-2024 - 6:33 IST
Published By : Hashtagu Telugu Desk
Alleti Maheshwar Reddy: తెలంగాణలో సుంకిశాల (Sunkishala) మ్యాటర్ సుడిగుండంలా తిరుతూనే ఉంది. సైడ్ వాల్ (Side Wall) కూలడంతో…ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy)కాంగ్రెస్‌పై కౌంటర్ ఎటాక్ కి దిగారు. ఓ విధంగా చెప్పాలంటే…ఏలేటి తన టీమ్‌తో సర్కారుపై (Cong Govt) సమరానికి సై అంటున్నారనే చెప్పాలి.
తెలంగాణలో పాలిటిక్స్ (Telangana Politrics) పీక్స్ కి చేరాయి. నేతలంతా సై అంటే సై అంటూ మాటలతోనే కారాలు మిరియాలు నూరుతున్నారు. రుణమాఫీ (Runamafi) రగడ రచ్చకెక్కగా..సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన మ్యాటర్.. మరింత మంట పుట్టించింది. మేఘా ఇంజనీరింగ్ (MEIL) కంపెనీ నిర్లక్ష్యంతోనే.. సుంకిశాల ప్రాజెక్టులోని రిటైనింగ్‌వాల్ కూలిందని బీజేపీ లీడర్లు సీన్ లో కి (Bjp Leaders) ఎంటరయ్యారు.
కారు పార్టీ దూరేందుకు ఛాన్స్ ఇవ్వకుండా.. బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సర్కార్ ని టార్గెట్ చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా…ఆ కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్సీ (Criminal Negligency) కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాసిరకం పనులు చేస్తున్న మేఘా సంస్థను.. బ్లాక్ లిస్టులో పెట్టి, మేఘా కృష్ణారెడ్డి (Megha Krishna Reddy) లైసెన్స్ (Licence) రద్దు చేయాల కూడా అన్నారు.
ఆయన అలా డిమాండ్ పెట్టారో లేదో..సర్కార్ కూడా ఆ కంపెనీకి షోకాజ్ నోటీసులు (Showcause Notice) ఇవ్వడంతో.. ఏలేటి విక్టరీ సెలబ్రేషన్ కి తెరలేపారు. ఇది బీజేపీ సాధించిన విజయంగా చెప్తున్నారు పొలిటికల్ పండిట్స్ (Political Pandits). ఐతే..ఏలేటి మాట్లాడుతున్న మాటలు వింటుంటే.. ఓ మినిస్టర్ చేతిలో మహేశ్వర్ రెడ్డి కీలు బొమ్మగా మారారని.. పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా ఒక వార్తా కధనం (Viral News) చక్కర్లు కొడుతోంది. అయితే..ఇప్పటి వరకు ఏలేటి ఈ ఎపిసోడ్‌లో కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అగ్రెసివ్ కామెంట్స్ చేసిన వ్యక్తి..ఉన్నట్టుండి సైలెంట్ అవ్వడంతో..ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.