Telangana Elections 2023 : తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్..
వయోవృద్ధులు 80 ఏళ్లు దాటిన వారు, నడవలేని వికలాంగుల వారికి ఇంటి నుండే ఓటు వేసే అవకాశం కలిపించారు
- Author : Sudheer
Date : 20-11-2023 - 1:19 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Assembly Election 2023 Polling) మొదలైంది..అదేంటి నవంబర్ 30 కదా..అప్పుడే మొదలుకావడం ఏంటి అని అనుకుంటున్నారా..? ఈసారి ఎన్నికల సంఘం వృద్ధులకు, వికలాంగులకు ఇంటి నుండే ఓటు వేసే అవకాశం (Voting from Home) కల్పించిన సంగతి తెలిసిందే. వయోవృద్ధులు 80 ఏళ్లు దాటిన వారు, నడవలేని వికలాంగుల వారికి ఇంటి నుండే ఓటు వేసే అవకాశం కలిపించారు. ఇందుకోసం వారు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటీకే ఆ ప్రక్రియ పూర్తి కావడం తో ఈరోజు నుండి పోలింగ్ మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంటి వద్దే వయోవృద్ధులు ఓటు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సిబ్బంది వృద్ధుల ఇంటికి వెళ్లి ఓటు వేయిస్తున్నారు. 80 ఏళ్ళు దాటిన వయో వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఇక సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మంండలం లింగరాజుపల్లిలో 85 సంవత్సరాల పెద్దరాజయ్య ఓటు వేశారు. నిన్న ఒక్కరోజే పోస్టల్ బ్యాలెట్ ద్వారా 21 మంది వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గతంలో ఓటు వేయాలంటే.. వృద్ధులు, వికలాంగులు వీల్ చైర్స్ లో రావలసిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు.. పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయలేని వృద్ధులు, వికలాంగులు ఫారం డి-12ను సమర్పిస్తే.. ఇంటి నుంచే ఓటేసేందుకు ఎన్నికల అధికారికి బీఎల్ఓ సిఫార్సు చేస్తారు. ఇంటికి వచ్చే ముందు పోలింగ్ సిబ్బంది సమాచారం ఇస్తారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు వేస్తే.. వాటిని సేకరించి పోలింగ్ సిబ్బంది తీసుకెళ్తారు. తెలంగాణలో మొత్తం 28,057 మంది వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
Read Also : Vijayashanthi – Election Campaign : ఖమ్మం, మహబూబాబాద్ లలో విజయశాంతి ప్రచారం..