TRS Support To Margaret: మార్గరెట్ అల్వాకు ‘టీఆర్ఎస్’ జై
భారత ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు
- Author : Balu J
Date : 05-08-2022 - 5:04 IST
Published By : Hashtagu Telugu Desk
భారత ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) శుక్రవారం నిర్ణయించింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అల్వాకు మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది ఎంపీలు ప్రతిపక్షాల అభ్యర్థికే ఓటు వేస్తారని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉండగా అదే రోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ మాజీ గవర్నర్ అల్వా, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖర్‌తో నేరుగా పోటీలో ఉన్నారు. గత నెలలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. సిన్హా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము చేతిలో ఓడిపోయారు.