Robbery : కొంపల్లి లో పట్టపగలు దొంగతనానికి పాల్పడిన దొంగలు..
మేడ్చల్ రోడ్డులో ఉన్న ఓ బంగారం షాప్ కు ముసుగు వేసుకొని కస్టమర్లంటూ వచ్చారు. దొంగల్లో ఒకరు కత్తితో కొరడాతో కొట్టి, నగల పెట్టెలను బ్యాగ్‌లో ఉంచమని యజమానిని బెదిరించారు
- By Sudheer Published Date - 08:42 PM, Thu - 20 June 24

హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా నేరాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలు అందరు చూస్తుండగా కత్తులతో దాడులకు తెగపడుతున్నారు. అంతే కాదు దొంగలు కూడా రెచ్చిపోతున్నారు. రోడ్లపై పోలీసులు అటు ఇటు తిరుగుతున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా గురువారం కొంపల్లి లోని ఓ నగల షాప్ కు వెళ్లి యజమాని కి కత్తితో బెదిరించి దొంగతనానికి ట్రై చేసారు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
మేడ్చల్ రోడ్డులో ఉన్న ఓ బంగారం షాప్ కు ముసుగు వేసుకొని కస్టమర్లంటూ వచ్చారు. దొంగల్లో ఒకరు కత్తితో కొరడాతో కొట్టి, నగల పెట్టెలను బ్యాగ్‌లో ఉంచమని యజమానిని బెదిరించారు. అయితే, నిందితులు ఆభరణాలపై చేయి వేయకముందే, షాప్ యజమాని బయటకు వచ్చి కేకలు వేయడం తో నిందితులు షాపు నుంచి బయటకు వచ్చి బైక్ పరారయ్యారు. ఇదే సమయంలో షాప్ లో పనిచేసే ఓ వర్కర్ ఆ దొంగ ఫై కుర్చీ విసిరాడు, కాని ఇద్దరూ పారిపోయారు. అయితే దుండగులు కొన్ని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని షాప్ కీపర్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. రోడ్డుపై అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు క్లూస్ టీమ్‌తో ఘటనాస్థలిని సందర్శించి కొన్ని విషయాలను సేకరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Read Also : TFC : ఏపీ సర్కార్ కు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి లేఖ