Twitter War : ధాన్యం కొనుగోలుపై ‘రాహుల్ గాంధీ’కి ఎమ్మెల్సీ ‘కవిత’ కౌంటర్..!
తెలంగాణలో రైతుల ధాన్యం కొనుగోలు పై టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ... రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటు అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేసీఆర్ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
- Author : Hashtag U
Date : 29-03-2022 - 11:29 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో రైతుల ధాన్యం కొనుగోలు పై టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ… రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటు అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేసీఆర్ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
.@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
కవిత ఏమన్నారంటే… ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలుపడం కాదు… ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని… ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీకి సూచించారు ఎమ్మెల్సీ కవిత.
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022