TGS RTC LOGO : టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ఫేకా ? నిజమైందేనా ? సజ్జనార్ క్లారిటీ
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ప్రతీ విభాగంపై తనదైన ముద్రవేసే దిశగా ముమ్మర కసరత్తు చేస్తోంది.
- By Pasha Published Date - 03:40 PM, Thu - 23 May 24
![TGS RTC LOGO : టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ఫేకా ? నిజమైందేనా ? సజ్జనార్ క్లారిటీ](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/TGS-RTC-LOGO.jpg)
TGS RTC LOGO : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ప్రతీ విభాగంపై తనదైన ముద్రవేసే దిశగా ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈక్రమంలోనే టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా ఇటీవలే మార్చింది. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో డిజైన్‌ను ఇంకా ఫైనల్ చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో దీనిపై తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో ఇదేనంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ లోగో మారిందనే ప్రచారాన్ని ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఖండించారు. కొత్త లోగో ఇంకా రెడీ కాలేదని వెల్లడించారు. అధికారికంగా ఇప్పటివరకు టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగోను విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఇకపై తమ సూచనలు, ఫిర్యాదులను @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాల ద్వారా అందించవచ్చన్నారు.
#TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024
We’re now on WhatsApp. Click to Join
ప్రభుత్వ విభాగాలన్నీ ఇక నుంచి తెలంగాణను టీఎస్ బదులుగా టీజీగానే ప్రస్తావించాలని గతంలో తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిని ఇచ్చింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో అధికారిక సమాచారాలు, జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో అంతటా ‘టీజీ’ అనే పదాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో కూడా టీజీని వాడుతున్నారు. టీఎస్ అని ముద్రించిన స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్‌ను తొలగించి, టీజీతో కొత్తగా ముద్రిస్తున్నారు.
Also Read :Vidyadhan : టెన్త్‌లో 90 శాతం మార్కులు వచ్చాయా ? ఈ స్కాలర్షిప్ మీకే
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![TSRTC: కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/TGSRTC-free-travel-780x470-1.jpg)
TSRTC: కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణం
ఇటీవల కరీంనగర్ బస్ స్టేషన్లో జన్మించిన శిశువుకు జీవితకాలం ఉచిత ప్రయాణాన్ని ప్రదానం చేసింది టిజిఎస్ఆర్టిసి. హైదరాబాద్‌లోని బస్ భవన్లో బుధవారం జూన్ 19న జరిగిన కార్యక్రమంలో నవజాత శిశువు జీవితకాల పాస్‌ను చిన్నారి తల్లి కుమారికి బహుమతిగా అందజేశారు టిజిఎస్ఆర్టిసి ఎండి విసి సజ్జనార్.