Ts Constable Exam Key : కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ ‘కీ’ రిలీజ్
తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ‘కీ’ని (Ts Constable Exam Key ) రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం రిలీజ్ చేసింది.
- By pasha Published Date - 08:04 AM, Mon - 22 May 23

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ‘కీ’ని (Ts Constable Exam Key ) రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం రిలీజ్ చేసింది. ఏప్రిల్ 30న నిర్వహించిన ఈ ఎగ్జామ్ రిజల్ట్ ను అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ లో అభ్యర్థులు రిజల్ట్ చూసుకోవచ్చు. ఎగ్జామ్ ప్రిలిమినరీ ‘కీ’లో (Ts Constable Exam Key ) అభ్యంతరాలుంటే మే 24న సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయవచ్చు. అభ్యంతరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక ప్రొఫార్మాను అందుబాటులో ఉంచారు.
also read : Jobs With Ms Excel : MS EXCEL వస్తే..ఎక్సలెంట్ జాబ్స్
అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం ఎంటర్ చేసి, సంబంధించిన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ ఈ అభ్యర్థన అసంపూర్తిగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఫైనల్ కీని విడుదల చేసే సమయంలో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను సైతం వారి లాగిన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇందులో భాగంగా పోలీస్ కానిస్టేబుల్ (సివిల్), పీసీ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్ట్, ఐటీ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షకు సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు 1,08,055 మంది హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థులు 6,088 మంది హాజరయ్యారు.

Related News

Navy Agniveer : ఇంటర్ పాసయ్యారా.. నేవీలో జాబ్ ఇదిగో
ఇంటర్ పాసయ్యారా ? అయితే ఈ జాబ్ మీకోసమే !! ఇండియన్ నేవీ లో అగ్నివీర్ (Navy Agniveer) జాబ్ మీకోసమే..