Modi Report Card: టీఆర్ఎస్ చేతిలో ‘మోడీ’ రిపోర్ట్ కార్డు
హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
- By Hashtag U Published Date - 05:10 PM, Tue - 12 July 22

హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్టు విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ జీతభత్యాలు, పర్యటనల నుంచి ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం కోరిన విషయం తెలిసిందే. బీజేపీకి కౌంటర్ టీఆర్ఎస్ నరేంద్రమోడీ సంబంధించిన ఖర్చు గురించి 100 అభ్యర్థలను దాఖలు చేసింది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. వివిధ రంగాల్లో మోడీ హాయంలో భారతదేశం ప్రగతి ఎలా ఉంది. ఏ ర్యాంక్ దక్కించుకుంది అనే అంశాలపై రిపోర్ట్ కార్డును విడుదల చేశారు. ‘నరేంద్ర మోడీ అధికారవంతుడు. అతను రాజ్యాంగాన్ని గౌరవించాలి. దాని విలువలకు కట్టుబడి ఉండాలి అని అన్నారు. ఎల్‌బీ నగర్‌లో భారతీయ జనతా పార్టీని, ప్రధాని మోదీని ఉద్దేశించి వేసిన పోస్టర్ ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.