TRS Leader Snatches Mike: అసోం సీఎంకు చేదు అనుభవం.. మైక్ లాగేసిన టీఆర్ఎస్ నేత, వీడియో వైరల్!
అసోం సిఎం హిమంత బిస్వా శర్మ ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- Author : Balu J
Date : 09-09-2022 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
అసోం సిఎం హిమంత బిస్వా శర్మ ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులనుద్దేశించి మాట్లాడుతున్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీలో పాల్గొని వేదికపై మాట్లాడుతుండగా, హిమంత బిస్వా శర్మను ధిక్కరించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. సీఎం బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడుతుండగా, గులాబీ కండువా (టీఆర్ఎస్ నాయకుడు) కప్పుకున్న వ్యక్తి అకస్మాత్తుగా స్టేజీపైకి వచ్చి మైక్ ను లాగేసుకున్నాడు.
ఈ ఘటనతో అస్సాం సీఎం ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ నేతలు ఆ వ్యక్తిని పట్టుకొని స్టేజీపైనుంచి బలవంతంగా కిందకు పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అంతకుముందు రోజు, ఇక్కడ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా శర్మ “ప్రభుత్వం దేశం కోసం, ప్రజల కోసం ఉండాలి, కానీ ఎప్పుడూ ఒక కుటుంబం కోసం కాదు’’ కేసీఆర్ నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Telangana: A man tried to confront Assam CM Himanta Biswa Sarma by dismantling the mike on a stage at a rally in Hyderabad pic.twitter.com/HFX0RqVEd8
— ANI (@ANI) September 9, 2022