Transgender Laila : తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు..ఎన్నికల సంఘం ఓటు ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహనా పెంచే బాధ్యత తీసుకుంటుంది. ఇందుకోసం టాప్ సినీతారలను రంగంలోకి దించుతుంది
- By Sudheer Published Date - 04:34 PM, Wed - 20 September 23
తెలంగాణ లో ఎన్నికల (2023 Telangana Elections) సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ (Telangana Election Notification 2023) విడుదల చేయాలనీ ఎన్నికల సంఘం చూస్తుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతుండగా..రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Telangana State Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారకర్తగా (Brand Ambassador) ఒక ట్రాన్స్‌జెండర్ ను ఎంపిక చేసి అందర్నీ షాక్ కు గురి చేసారు. తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా ఒక ట్రాన్స్‌జెండర్ (Transgender ) ను ఎంపికవ్వడం విశేషంగా అంత మాట్లాడుకుంటున్నారు.
ఎన్నికలు (Election Time) వస్తున్నాయంటే చాలు..ఎన్నికల సంఘం ఓటు ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహనా పెంచే బాధ్యత తీసుకుంటుంది. ఇందుకోసం టాప్ సినీతారలను రంగంలోకి దించుతుంది. ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై జనాలకు అవగాహన కల్పించడమే కాక వారిని చైతన్యం చేయడం చేస్తుంటుంది. ప్రతి సారి ఎన్నికల కమిషన్ ఇలాగే అనేక ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. అయితే ఈసారి ప్రతిసారి మాదిరిగా కాకుండా.. సెలబ్రిటీలను పక్కకు పెట్టి ఓ ట్రాన్స్‌జెండర్ ను ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను ప్రచారకర్తగా ఎంపిక చేసింది ఎన్నికల సంఘం. లైలాతోనే ఎన్నికల ప్రచారం చేయబోతుంది.
Read Also : Telangana Congress Candidates First List : తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ సభ్యులు వీరేనా..?
ప్రచార కర్తగా ట్రాన్స్‌జెండర్ లైలా (Transgender Laila)నే ఎంపిక చేయడం వెనుక..ఆమె చేసిన పనులే కారణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తూ, వారి సమస్యలపై ఎప్పటికప్పడు పోరాటాలు చేస్తూ.. పరిష్కారం కోసం కృషి చేస్తుంది. ఇక ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో వారంలో ఒక రోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయించింది. అలా వారి కమ్యూనిటీ శ్రేయస్సుకు పాటుపడుతున్న లైలాను.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా నియమించింది.
Related News
Yuvraj Singh: టీ20 వరల్డ్‌కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్
T20 ప్రపంచ కప్ 2024 మొదటిసారిగా USA, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.