Revanth Horse Ride: గుర్రమెక్కిన రేవంత్.. సీఎం సీఎం అంటూ స్లోగన్స్!
మునుగోడు ఉప ఎన్నికల కోసం రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మునుగోడు మండలం కిష్టాపురంలో ఎన్నికల ప్రచారంలో
- By Balu J Published Date - 12:22 PM, Thu - 20 October 22

మునుగోడు ఉప ఎన్నికల కోసం రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మునుగోడు మండలం కిష్టాపురంలో ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్రంపై ఎక్కి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. మునుగోడులో ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రేవంత్‌రెడ్డి ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు.
బుధవారం మండలంలోని కిష్టాపురం గ్రామంలో రేవంత్ రెడ్డి పర్యటించి పార్టీ కార్యకర్తల వినతి మేరకు గుర్రపు స్వారీ చేశారు. కాబోయే సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ గుర్రం ఎక్కి గ్రామమంతా తిరిగారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.