Kavitha New Party : కవిత కొత్త పార్టీ పెడితే ప్లస్ లు..మైనస్ లు ఇవే !!
Kavitha New Party : తెలంగాణలో కుటుంబ రాజకీయాలపై ఇప్పటికే విమర్శలు ఉన్నా, కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్నా, ఆమె పార్టీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఇవ్వగలదనే విశ్వాసం కొందరిలో ఉంది
- By Sudheer Published Date - 05:59 PM, Tue - 27 May 25

తెలంగాణ రాజకీయాల్లో కవిత (Kavitha) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కవిత..తాజాగా మై డియర్ డాడీ అంటూ కేసీఆర్ కు లేఖ (Kavitha Letter) రాసి తన అసంతృప్తిని వ్యక్తం చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం కవిత కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారనే వార్తలు వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే ప్లస్ లు ఏంటి..? మైనస్ లు ఏంటి..? అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి వారు ఏమనుకుంటున్నారో చూద్దాం.
Bhairavam : రిలీజ్ కాకముందే ‘భైరవం’ టీం సక్సెస్ సంబరాలు..ఏంటో ఈ అతి ఉత్సహం !
కవితకు ఉన్న ఉద్యమ నేపథ్యం, తెలంగాణ జాగృతి ద్వారా ఏర్పరచుకున్న బేస్, మహిళా ఓటర్లకు సమర్పించుకునే సామర్థ్యం వంటి అంశాలు పార్టీ స్థాపనకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు రాజకీయంగా . చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజల్లో ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఆశిస్తున్న సందర్భంలో కవిత నాయకత్వం దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. తెలంగాణలో కుటుంబ రాజకీయాలపై ఇప్పటికే విమర్శలు ఉన్నా, కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్నా, ఆమె పార్టీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఇవ్వగలదనే విశ్వాసం కొందరిలో ఉంది.
అయితే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం కవిత కొత్త పార్టీకి పెద్దగా అనుకూలంగా లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీజేపీ తన బలం పెంచుకుంటోంది. బీఆర్ఎస్ కూడా వరంగల్ సభ ద్వారా తన బలం చాటింది. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పెడితే అది బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ను పంచుకునే ప్రమాదం ఉంది. కొత్త పార్టీకి స్పష్టమైన ప్రజా లక్ష్యం, విస్తృతమైన నిధులు, రాజకీయ మద్దతు అవసరం. ఇవన్నీ కలపగలిగితేనే కవిత పార్టీ స్థిరపడగలదు. లేకుంటే ఇది తాత్కాలిక రాజకీయ సంక్షోభంగా ముగిసే అవకాశముంది. అయినా, కవిత తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు కావడం ఖాయం.