Suravaram Sudhakar Reddy : సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళ్లు
Suravaram Sudhakar Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
- By Sudheer Published Date - 04:15 PM, Sun - 24 August 25

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy ) మృతి పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మగ్దూమ్ భవన్‌లో ఉంచిన సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
Balakrishna: అరుదైన రికార్డు.. తొలి నటుడిగా బాలకృష్ణ!
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సుధాకర్ రెడ్డి మృతి దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో తామిద్దరం కలిసి పోరాటం చేశామని గుర్తుచేసుకున్నారు. దేశ రాజకీయాల్లో సుధాకర్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
సురవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సీపీఐ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. రెండు సార్లు నల్గొండ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతి కమ్యూనిస్టు పార్టీకి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటు.