HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Stands Second In Country In Terms Of Drunken Driving

Drunk and Drive : మందు బాబులం.. మేం మందుబాబులం.. ఆ ప్ర‌మాదాల్లో ‘తెలంగాణ‘ సెకండ్ ప్లేస్!

హైద‌రాబాద్‌లో ప్ర‌తిరోజు ఏదో ఒక ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ వాహ‌న‌దారుల తీరు మార‌డం లేదు. వీకెండ్స్‌లో వంద‌ల సంఖ్య‌లో వాహ‌న‌దారులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డుతున్నారు.

  • Author : Balu J Date : 29-10-2021 - 12:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

హైద‌రాబాద్‌లో ప్ర‌తిరోజు ఏదో ఒక ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ వాహ‌న‌దారుల తీరు మార‌డం లేదు. వీకెండ్స్‌లో వంద‌ల సంఖ్య‌లో వాహ‌న‌దారులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డుతున్నారు. వీరిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి ఫైన్ వేసి వ‌దిలేస్తున్నారు. త‌రువాత య‌ధామాములుగానే వీరంతా తాగి రోడ్ల‌పై డ్రైవ్ చేస్తున్నారు.దీనికి నిద‌ర్శ‌న‌మే ఎన్‌సీఆర్‌బీ విడుద‌ల చేసిన నివేదిక‌.

మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గురువారం ఓ నివేదిక‌ను విడుదల చేసింది. భారతదేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు 2020 నివేదిక ప్రకారం, 2020 సంవత్సరంలో నమోదైన 3,026 మరణాల్లో తెలంగాణలో 340 మంది తాగి డ్రైవింగ్ చేస్తూ మరణించార‌ని ఎన్‌సీఆర్‌బీ వెల్ల‌డించింది. ప్రమాద మరణాల రేటు 31.5 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు 27.7 శాతం కంటే కొంచెం ఎక్కువ. తెలంగాణలో మొత్తం ప్రమాద మరణాల సంఖ్య 11,822 కాగా, అందులో 9,868 మంది పురుషులు, 1,954 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో 19,505 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదైయ్యాయి. దీనిలో 7,219 మంది మరణించ‌గా 18,661 మంది గాయపడ్డారు. 2020 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో 6,882 మంది మరణించగా, రైల్వే ప్రమాదాల్లో 337 మంది మరణించారు.

రాష్ట్రంలో 262 మంది గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు నివేదిక‌లో పేర్కొంది. 24 మంది జంతువులు, 12 మంది ఆహార విషం కారణంగా మరణించారు. పాము కాటు కారణంగా మొత్తం 168 మంది చనిపోగా.. వాణిజ్య భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఆరుగురు మరణించిన‌ట్లు తెలిపింది. నివాస భవనాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 79 మంది మరణించగా…ప్రభుత్వ భవనాల్లో అగ్నిప్రమాదం కారణంగా 9 మంది మరణించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • drive
  • drunk
  • second place
  • telengana

Related News

Ajit Pawar Last Rites

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

Ajit Pawar  విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక

  • Ajit Pawar Plane Crash

    Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd