Telanagana : కవిత ED విచారణ వేళ, మరో లిక్కర్ స్కామ్
లిక్కర్ స్కామ్ కొత్త కోణం తెలంగాణలో(Telangana) పొడచూపుతోంది.
- By CS Rao Published Date - 04:42 PM, Wed - 15 March 23

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కొత్త కోణం తెలంగాణలో(Telangana) పొడచూపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించిన ఫారిన్ లిక్కర్(Liquor scam) స్కామ్ ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన కొన్ని అంశాలను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బయటపెట్టారు. లిక్కర్ సేల్స్ ద్వారా ఒకే వ్యక్తికి వందల కోట్లు లబ్ది చేకూరేలా అనుమతులు ఇచ్చిన కేసీఆర్ సర్కార్ వాలకాన్ని బయటపెట్టడానికి సిద్ధమయ్యారు. రెండు, మూడు రోజుల్లో ఆ వ్యక్తి ఎవరు? షాపు ఎక్కడ? అనేది బయట పెడతానని వెల్లడిస్తూ సంచలనం లేపారు.
లిక్కర్ స్కామ్ కొత్త కోణం తెలంగాణలో (Telangana)
రెండోసారి కవిత ఈడీ విచారణకు వెళుతోన్న వేళ సరికొత్త లిక్కర్ స్కామ్(Liquor scam) కు సంబంధించిన లీకులను ఇవ్వడం దుమారం రేగుతోంది. అతి పెద్ద లిక్కర్ కుంభకోణం తెలంగాణలో(Telangana) జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. ఢిల్లీని మించిన తెలంగాణలో భారీ లిక్కర్ స్కామ్ ను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. అందుకు సంబంధించిన కొన్ని సూత్రప్రాయ ఆధారాలను లీకు చేశారు.
Also Read : Delhi Liquor Scam: కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లడం ఖాయమేనా!
మాజీ ఎంపీ (Telangana)చేస్తోన్న ఆరోపణల ప్రకారం ఫారిన్ లిక్కర్ సేల్స్ (Liquor scam) ద్వారా తెలంగాణలో ఒక వ్యక్తికి వందల కోట్ల లబ్థి చేకూరుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఫారిన్ లిక్కర్ పాలసీకి ఐదేళ్ల కాలపరిమితి ఇచ్చారు. గతానికి భిన్నంగా అనుమతులు ఇవ్వటానికి కారణమేంటో తేలాల్సి ఉంది. కేవలం 24 గంటల సమయం ఇస్తూ ఫారిన్ లిక్కర్ టెండర్ గడువును తెలంగాణ సర్కార్ నిర్దేశించింది. అంతేకాదు, ఆ టెండర్లో కేవలం ఒకే ఒక వ్యక్తి పాల్గొన్నారు. వేల కోట్ల రూపాయల ఫారిన్ మద్యం విక్రయాలకు సంబంధించిన టెంబర్ కు ఒకే ఒక్క అప్లికేషన్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తే ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ తెలంగాణలో బయట పడుతుందని బూర చెబుతున్నారు.
ఈడీ విచారణకు వెళుతోన్న సందర్భంగా తెలంగాణలోని ఫారిన్ లిక్కర్ (Liquor scam)
హైదరాబాద్‌లోని (Telangana)వైన్స్ షాపులో రోజుకు కోటి రూపాయలు పైగా అమ్మకాలు జరుగుతున్నాయని నర్సయ్య వెల్లడించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తికి వెళ్తోందని తెలిపారు. షాపు పేరు, వ్యక్తి పేరు త్వరలో బయటపెడతామని మాజీ ఎంపీ మీడియా ముందుకు రావడంతో సంచలనం కలిగిస్తోంది. లిక్కర్ స్కామ్ (Liquor scam) లో ఏ మూలన ఏది జరుగుతున్నప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న కవిత పేరు గుర్తుకు వస్తోంది.రెండోసారి ఆమె ఈడీ విచారణకు వెళుతోన్న సందర్భంగా తెలంగాణలోని ఫారిన్ లిక్కర్ వ్యవహారం తెరమీదకు రావడం గమనార్హం.
Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటిదాకా 10 మందికిపైగా అరెస్టయ్యారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి, పలువురు వ్యాపారవేత్తలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఒకసారి విచారించింది. రేపు మరోసారి విచారించనుంది.
Related News

MLC Kavitha: నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. బీఆర్‌ఎస్ లో తీవ్ర ఉత్కంఠ..!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు హాజరుకానున్నారు. ముందుగా ఆమె మార్చి 16న హాజరు కావాల్సి ఉండగా.. బదులుగా తన లాయర్‌ను పంపింది.