HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Rising Makes The Whole World Look Towards Telangana

Telangana Rising – 2047 : ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా ‘తెలంగాణ రైజింగ్’

Telangana Rising - 2047 : తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను (Investments) ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

  • Author : Sudheer Date : 03-12-2025 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Revanth Telangana Rising
Cm Revanth Telangana Rising

తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను (Investments) ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ సదస్సు డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో జరగనుంది. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల నుండి వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు, మేధావులు సహా 4,000 మందికి పైగా అతిథులుగా హాజరుకానున్నారు. ఈ భారీ సదస్సు ద్వారా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించాలని రేవంత్ సర్కార్ సంకల్పించింది. అంతేకాకుండా, తెలంగాణను ‘సభూతో న భవిష్యత్’ అన్నట్లుగా పెట్టుబడులకు స్వర్ణధామంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేయడం ద్వారా, తెలంగాణ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.

Amaravati : అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

సదస్సుకు హాజరయ్యే అతిథులను తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగతించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అతిథులకు అందిచే స్పెషల్ గిఫ్ట్ బాస్కెట్‌లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అనేక జ్ఞాపికలు ఉండనున్నాయి. ఇందులో ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లు, పోచంపల్లి తాలువా, మరియు నిర్మల్ మాస్క్ పెయింటింగ్స్ ఉండనున్నాయి. అంతేకాక, హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చే హైదరాబాద్ అత్తర్ మరియు హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు కూడా ఈ బాస్కెట్‌లో భాగమవుతాయి. మరోవైపు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్‌ను కూడా అందించనున్నారు. ఇందులో మహువా లడ్డులు, సకినాలు, బప్పాలు, రామ్ డి వంటి సాంప్రదాయ తెలంగాణ వంటకాలు ప్రత్యేక డిజైన్ చేసిన కవర్లలో ప్యాక్ చేసి స్వాగతం పలకనున్నాయి.

ఈ సదస్సు కోసం దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే బాధ్యతను రేవంత్ ప్రభుత్వం స్వయంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతర్జాతీయ ప్రముఖులతో పాటు, దేశ ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్ర నేతలు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సదస్సుకు హాజరుకానున్నారు. ఇంతేకాక దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను (సీఎంలను) కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఆయా రాష్ట్రాల సీఎంలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించే బాధ్యతను డిసెంబర్ 4న మంత్రులకు అప్పగించారు. ఈ విధంగా కేంద్ర నాయకులను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం ద్వారా, సదస్సుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడంతో పాటు, పెట్టుబడుల ఆకర్షణకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని రేవంత్ ప్రభుత్వం వ్యూహరచన చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Global Summit 2025
  • Hyderabad Rising
  • Rajiv Yuva Vikasam
  • Telangana Global Summit 2025
  • Telangana Rising 2047 survey
  • Telangana Rising-2047

Related News

Cwc Meeting

కాసేపట్లో CWC కీలక భేటీ, కీలక నేతలంతా హాజరు

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు

  • Ias Officers Transfer In Te

    తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు

  • Harish Rao

    చీకటి జీవోల మాటున ఏం చేస్తున్నావ్ రేవంత్ – హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

  • CM Revanth

    కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు

  • Harish Rao Warning

    నీ చరిత్ర ఇది రేవంత్ – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Latest News

  • ఫిబ్రవరిలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు?

  • మహిళా కమిషన్‌ విచారణకు హాజరైన నటుడు శివాజీ!

  • అనసూయ బాటలో నాగబాబు, శివాజీ అన్నది ముమ్మాటికీ తప్పే !

  • శివాజీకి సపోర్ట్.. అనసూయ పై ఫైర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి !

  • డ్రగ్స్ కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిన హీరోయిన్ సోదరుడు ?

Trending News

    • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

    • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

    • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

    • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

    • 2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd