HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Mla Rajagopal Reddy To Join Bjp On Aug 21

MLA Rajagopal Reddy: 21న బీజేపీలోకి రాజగోపాల్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 21న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతున్నట్లు

  • Author : Balu J Date : 06-08-2022 - 1:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajagopal Reddy
Rajagopal Reddy

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 21న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో జరిగే సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అధికారికంగా కాషాయ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. షాతో భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రకటన చేశారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఉన్నారు.

పార్టీలో చేరాల్సిందిగా అమిత్ షా తనను ఆహ్వానించారని, ఆహ్వానాన్ని మన్నించారని మునుగోడు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 8న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలుస్తానని, అసెంబ్లీకి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక తెలంగాణలో పెనుమార్పు తెస్తుందని ఆయన జోస్యం చెప్పారు. తన స్వార్థం కోసం ఉప ఎన్నికలకు వెళ్లడం లేదని, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నారు. రాష్ట్ర రాజకీయాల గమనాన్ని మార్చేందుకు మునుగోడు ప్రజలు ఆదేశిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తగిన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా తప్పుడు వ్యక్తిని నియమించారని ఆరోపించిన రాజగోపాల్‌రెడ్డి.. ఆత్మగౌరవం ఉన్నవారు పార్టీలో ఉండరని వ్యాఖ్యానించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డికి ఆయన మరోసారి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అరాచక పాలనను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రమే అంతం చేయగలరని అన్నారు. ఉపఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతుండడంతో మునుగోడు, ప్రజల కోసమే తన నిర్ణయమని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • BJP Telangana
  • komatireddy rajagopal reddy
  • munugodu

Related News

West Bengal BJP CM Suvendu Adhikari

Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక మలుపు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఏలిన బెంగాల్ గడ్డపై మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద

  • Suvendu Adhikari as Bengal CM

    Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

  • Congress must introspect, says Shashi Tharoor

    Shashi Tharoor: మోదీ, షా వ్యూహం భేష్.. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్

Latest News

  • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

  • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

  • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd