Telangana Man : సౌదీ ఎడారిలో కరీంనగర్ యువకుడి దుర్మరణం
రబ్ అల్ ఖలీ ఎడారిలో అతడు డీహైడ్రేషన్, అలసటతో బాధపడుతూ ప్రాణాలు విడిచాడు.
- By Pasha Published Date - 09:08 AM, Sun - 25 August 24

Telangana Man : తెలంగాణకు చెందిన 27 ఏళ్ల యువకుడు మహ్మద్ షెహజాద్ ఖాన్ సౌదీ అరేబియాలో ప్రాణాలు విడిచాడు. రబ్ అల్ ఖలీ ఎడారిలో అతడు డీహైడ్రేషన్, అలసటతో బాధపడుతూ ప్రాణాలు విడిచాడు. కరీంనగర్‌కు చెందిన మహ్మద్ షెహజాద్ గత మూడేళ్లుగా సౌదీ అరేబియాలోని ఒక టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రబ్ అల్ ఖలీ ఎడారి 650 కిలోమీటర్లకుపైగా విస్తరించి ఉంది. జీపీఎస్ సిగ్నల్ ఫెయిల్ కావడంతో షెహజాద్, అతడి సహోద్యోగి (సూడాన్ జాతీయుడు) ఈ ప్రమాదకరమైన ఎడారిలోని ఓ పెద్ద నిర్మానుష్య ప్రదేశంలో దారి తప్పినట్లు గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join
సరిగ్గా ఇదే సమయానికి షెహజాద్‌కు(Telangana Man) చెందిన మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా డెడ్ అయింది. దీంతో వాళ్లిద్దరూ ఎవరికీ కాల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎడారిలో దారి కోసం వెతికే క్రమంలో అటూఇటూ తిరగడం వల్ల వారి వాహనంలోని ఇంధనం కూడా అయిపోయింది. దీంతో సరిగ్గా ఆహారం, నీరు దొరకక వారిద్దరూ చిక్కుకుపోయారు. ఎడారిలో మండుటెండ కింద గంటల కొద్దీ గడపడంతో ఇద్దరూ తీవ్ర డీహైడ్రేషన్ బారినపడ్డారు. చివరకు దారుణ స్థితిలో ప్రాణాలు విడిచారు. షెహజాద్, అతడి సహోద్యోగి మృతదేహాలను నాలుగు రోజుల తరువాత రబ్ అల్ ఖలీ ఎడారిలో గుర్తించారు.
Also Read : Telegram CEO Arrested: టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్.. కారణమిదేనా..?
సోనూ సూద్ మరో సాయం..
సౌదీ సిమెంట్ కంపెనీ హోఫఫ్‌కు చెందిన ప్లాంటులో పనిచేస్తున్న ఓ హైదరాబాదీ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. ఆయన మృతదేహం సౌదీ అరేబియాలోని కింగ్ ఫైజల్ జనరల్ హాస్పిటల్‌లో ఉంది. ఆయన డెడ్‌బాడీని సౌదీ నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఓ వ్యక్తి చేసిన రిక్వెస్టుకు రియల్ హీరో సోనూ సూద్ స్పందించారు. ‘‘తప్పకుండా నేను ఆ ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడాను’’ అని బదలిచ్చారు. మాట ఇచ్చిన విధంగానే సదరు వలస కార్మికుడి మృతదేహాన్ని సోనూ సూద్ ఇండియాకు తెప్పించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.