Telangana Schools – Chandrayaan 3 : స్కూళ్లు, కాలేజీల్లో చంద్రయాన్-3 లైవ్.. విద్యార్థులకు చూపించేందుకు ఏర్పాట్లు
Telangana Schools - Chandrayaan 3 : చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ కోసం యావత్ దేశం ఆతురతగా ఎదురు చూస్తోంది. బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగు మోపబోతోంది.
- Author : Pasha
Date : 22-08-2023 - 2:41 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Schools – Chandrayaan 3 : చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ కోసం యావత్ దేశం ఆతురతగా ఎదురు చూస్తోంది. బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగు మోపబోతోంది. ఈ చారిత్రక ఘట్టం చోటుచేసుకోనున్న వేళ తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేసి విద్యార్థులకు చూపించేలా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక స్క్రీన్స్, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. దీనికి సంబంధించి డీఈవోలు, ప్రిన్సిపల్స్‌కు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (Telangana Schools – Chandrayaan 3) ఆదేశాలు జారీచేశారు.
Also read : Price Hike : వామ్మో..ఇక వాటిని ఏం కొనలేస్తాం..?
మన చంద్రయాన్-3 ల్యాండర్ “విక్రమ్” చంద్రుడి దక్షిణ ధృవం పై దిగే ముహూర్తం బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6 గంటల 4 నిమిషాలు! అయితే ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించకుంటే, ల్యాండర్ విక్రమ్ లో ప్రాబ్లమ్స్ తలెత్తితే మూన్ ల్యాండింగ్ ను ఆగస్టు 27కు వాయిదా వేసే ఛాన్స్ ఉంది. ఈవిషయాన్ని అహ్మదాబాద్‌లోని ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ వెల్లడించారు. ల్యాండర్ మాడ్యూల్ పనితీరు, చంద్రునిపై ల్యాండింగ్ జరిగే ప్రదేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ల్యాండింగ్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.