Telangana : ఎవరైనా బీజేపీ జెండాలు పట్టుకొని వస్తే ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చిన కేసీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోడీ కి చేతకావటం లేదు. విశ్వగురు అని చెప్పుకునే మోడీ.. 9ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చడం లేదు
- By Sudheer Published Date - 08:22 PM, Sat - 16 September 23

కేంద్ర బిజెపి ఫై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR Angry). తెలంగాణ నీటి వాటా తేల్చమంటే మోడీ సర్కార్ (BJP Govt) స్పందించడం లేదని..ఎవరైనా బీజేపీ జెండాలు పట్టుకొని ఇంటివద్దకు వస్తే ప్రజలు నిలదీయాలని అన్నారు కేసీఆర్.
శనివారం పాలమూరు ఎత్తిపోతల పథకం (Palamuru – Rangareddy Project) మొదటి పంప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..’’దక్షిణ తెలంగాణ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం. పాలమూరు ప్రజలంటే ఒకప్పడు అడ్డా కూలీలు.ఈరోజు తెలంగాణ ప్రజలే.. ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారు. పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాను. కొందరు నేతల వల్లే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైంది. గత పాలకులు పాలమూరు జిల్లా నీటివాటా గురించి అడగలేదు. తెలంగాణ ఉద్యమంలో..నా తొలి పాదయాత్ర జోగలాంబ గద్వాల నుంచే ప్రారంభించా.పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంలను ఎవరూ ప్రశ్నించలేదు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని మండిపడ్డారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా (krishna water share to Telangana) తేల్చమంటే మోడీ కి చేతకావటం లేదు. విశ్వగురు అని చెప్పుకునే మోడీ.. 9ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చడం లేదు. ప్రజలు ఇది గమనించి బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. సమైక్య పాలనలో RDSను నాశనం చేశారని.. పాలమూరు ప్రాజెక్టును చాలా మంది అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు కేసీఆర్. ఈ ప్రాజెక్టుతో తన జన్మ ధన్యమైందన్నారు.
Read Also : Telangana liberation day : సెప్టెంబర్ 17 చరిత్ర, రాజకీయ పార్టీల వైఖరి!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 50 ఏళ్ల కాంగ్రెస్, 16 ఏళ్ల టీడీపీ పాలనలో మహబూబ్‌నగర్‌కు మెడికల్ కాలేజీ ఇచ్చారా ? ఈరోజు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయ్. ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నయ్. నిన్ననే తొమ్మిది కాలేజీలను ప్రారంభించాం. తెలంగాణ ఈ రోజు సంవత్సరానికి 10వేల మందిని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ లేదు. మామూలు స్కూల్ ఫీజంతా చెల్లిస్తే ఎంబీబీఎస్ చదువే పరిస్థితి బిడ్డలకు తీసుకువచ్చాం. పేదింటి పిల్లల కోసం బడుల్లో అల్పహారం అందిస్తున్నామని ఈ సందర్బంగా కేసీఆర్ చెప్పుకొచ్చారు.