టీఆర్ఎస్, బీజేపీ నడుమ `షో` రగడ
జనవరి 9వ తేదీ జరగనున్న కామిడీ షో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రణరంగాన్ని లేపనుంది. మునావర్, షారుఖీ ప్రదర్శనకు మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హైదరాబాద్ లో జరగనున్న షోకు ఇప్పటి నుంచే రాజకీయ రంగు పులుముకుంది.
- By CS Rao Published Date - 07:00 PM, Sat - 25 December 21
జనవరి 9వ తేదీ జరగనున్న కామిడీ షో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రణరంగాన్ని లేపనుంది. మునావర్, షారుఖీ ప్రదర్శనకు మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హైదరాబాద్ లో జరగనున్న షోకు ఇప్పటి నుంచే రాజకీయ రంగు పులుముకుంది. షోను రద్దు చేసుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా డిమాండ్ చేశాడు. ఎలాగైనా ప్రదర్శనను నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పట్టుబడుతున్నాడు. ఈ క్రమంలో ఇరు పార్టీ మధ్య మునావర్ షో వ్యవహారం వేడిక్కింది.దేశంలోని సుమారు 15 రాష్ట్రాల్లో మునావర్ షోను రద్దు చేసుకోవడం జరిగింది. ఆయన షో నిర్వహిస్తోన్న క్రమంలో హిందూ దేవుళ్లను కించిపరిచాడు. ఆ మేరకు ఆయన మీద హిందూవాదులు కేసు పెట్టారు. దీంతో ఆయన్ను నెల రోజుల పాటు జైల్లో జీవితం గడపాల్సి వచ్చింది. ఇటీవల విడుదలైన ఆయన మళ్లీ షోలకు ఉపక్రమించాడు.దేశ వ్యాప్తంగా మునావర్, షారుఖీ షోలను రద్దు చేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వాళ్ల డిమాండ్ మేరకు రద్దు చేయడం జరిగింది. ఢిల్లీ, లక్నో, బెంగుళూరు లాంటి సిటీల్లో షోలను రద్దు చేయగా, హైదరాబాద్ లో కు మంత్రి కేటీఆర్ ఆహ్వానించాడు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రగడ ప్రారంభం అయింది. జనవరి 9వ తేదీ నాటికి ఈ కామిడీ షో ఇరు పార్టీల మధ్య ఎలాంటి రచ్చను క్రియేట్ చేస్తుందో చూడాలి.