Telangana Budget Sessions 2024 : ముగిసిన బడ్జెట్ ప్రసంగం..సోమవారానికి వాయిదా
- By Sudheer Published Date - 01:54 PM, Sat - 10 February 24
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో తొలిపద్దు ను ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నారనేది వివరంగా ప్రసంగించి బడ్జెట్ ను ముగించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా వేశారు.
బడ్జెట్ హైలైట్స్ (Telangana Budget 2024 Highlights ) చూస్తే..
ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు :
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు భట్టి పేర్కొన్నారు. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగిందన్నారు. హామీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున, అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని విక్రమార్క తెలిపారు.
గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు కేటాయింపు :
రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించబోతున్నామని ఆర్థిక భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగిందన్నారు. దాని అమలుకు కావాల్సిన సత్వర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ పథకం అమలుకు బడ్జెట్లో రూ. 2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ. 16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు భట్టి తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.
రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ :
రైతుల రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు భట్టి. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు విధివిధానాలను రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామన్నారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో తెలంగాణ చూస్తోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
శాఖల వారీగా తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు :
- రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- ఆరు గ్యారంటీల కోసం రూ.53196 కోట్లు అంచనా
- పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు
- ఐటీ శాఖకు రూ.774కోట్లు
- పంచాయతీ రాజ్ రూ.40,080 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11692 కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.1000 కోట్లు
- వ్యవసాయ శాఖ రూ.19746 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250కోట్లు
- ఎస్సీ సంక్షేమం రూ.21874 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు
- మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు
- బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.8 వేల కోట్లు
- విద్యా రంగానికి రూ.21389కోట్లు
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
- వైద్య రంగానికి రూ.11500 కోట్లు
- గృహజ్యోతికి రూ.2418 కోట్లు
- విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు
- గృహనిర్మాణానికి రూ.7740 కోట్లు
- నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు
Read Also : EPF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేటు పెంపు..!
Related News
Telangana Budget 2024 : మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో తొలిపద్దు ను ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నారనేది వివరంగా సభలో భట్టి ప్రస్తావిస్తున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్ల�