Petrol Price: పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్ననాలుగు రాష్ట్రాలు ఇవే…?
లీటరు పెట్రోలు ధరలు ఎక్కువగా ఉన్న టాప్ 4 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
- By Hashtag U Published Date - 09:53 PM, Thu - 11 November 21

లీటరు పెట్రోలు ధరలు ఎక్కువగా ఉన్న టాప్ 4 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించినప్పటికి రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ కారణంగా అత్యధిక ధరలతో రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఏపీ మూడవస్థానం, తెలంగాణ నాల్గవ స్థానంలో ఉన్నాయి. దేశంలో పెట్రోలు ధర ఇప్పటికీ రూ. 105 కంటే ఎక్కువగా ఉన్న అనేక ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలె ధరలు తగ్గించినప్పటికీ, రాజస్థాన్ లో లీటరు ఇంధన ధర రూ. 111.10 వద్ద అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర (రూ. 109.98), ఆంధ్రప్రదేశ్ (రూ. 109.05), తెలంగాణ (రూ. 108.20) ఉన్నాయి. ఈ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ (రూ. 107.23), కేరళ (రూ. 106.36), బీహార్ (రూ. 105.90), పంజాబ్ (రూ. 105.02) ఉంది. కేంద్రం ధరలు తగ్గించిన తర్వాత, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6 నుండి 17 రూపాయల వరకు తగ్గాయి.
తెలంగాణలో పెట్రోల్ ధరలు 6.29 రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్‌లో 6.10 రూపాయలు తగ్గాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు పెట్రోల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించలేదు. తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడం ద్వారా కనీసం డీజిల్ ధరల విషయంలోనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని పెట్రోల్ పంపుల యజమానుల సంఘం అభిప్రాయపడింది. డీజిల్ విషయానికొస్తే, కర్ణాటక, తెలంగాణ మధ్య దాదాపు రూ. 8 ధర వ్యత్యాసం ఉంది. అనేక రవాణా వాహన యాజమానులు సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి డీజిల్ తెచ్చుకుంటున్నారు. ఫలితంగా పెట్రోల్,డీజిల్ వినియోగం ఆయా రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి వ్యాట్‌ను తగ్గించడం ఉత్తమం అని కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోల్ డీలర్స్ జాయింట్ సెక్రటరీ రాజీవ్ అమరం అన్నారు.
మిజోరంలో రూ. 107 నుండి రూ. 94. 94కి ఇంధన ధరలు పడిపోయాయి. కేంద్రం రేట్లు తగ్గించిన తర్వాత అన్ని రాష్ట్రాలు రూ. 11 నుండి రూ. 17 వరకు ధరలను తగ్గించాయి (కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించగా, మరికొన్ని చేయలేదు), ఆంధ్ర ప్రదేశ్ అత్యధికంగా రూ. 95. 18 వద్ద రెండవ స్థానంలో ఉంది. లీటరు డీజిల్ ధర రూ. 94. 62తో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది. రాజస్థాన్ లో అత్యధికంగా డీజిల్ ధర రూ.95.71గా ఉంది . మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, బీహార్, ఎంపీల్లో లీటరు డీజిల్ ధర ఇప్పటికీ రూ.90 పైనే ఉంది.